ETV Bharat / sports

'వాళ్లు ఒంటి చేత్తో గేమ్ గెలిపించేస్తారు - భారత్​పై నెగ్గాలంటే మాకు అదే ఇంపార్టెంట్​' - పాక్​ క్రికెటర్ - IND VS PAK CHAMPIONS TROPHY 2025

భారత్​పై ప్రశంసలు కురిపించిన పాక్ మాజీ క్రికెటర్ - 'వాళ్లు ఒంటి చేత్తో గేమ్ గెలిపించేస్తారు'

India Vs Pakistan Champions Trophy 2025
India Vs Pakistan Champions Trophy 2025 (IANS Photo)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 22, 2025, 5:14 PM IST

Shahid Afridi About Team India : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్​తో టీమ్​ఇండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రిదీ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమ్​ఇండియాపై ప్రశంసలు కురిపించాడు. పాకిస్థాన్​తో పోలిస్తే టీమ్​ఇండియాలో ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని కొనియాడాడు.

'ఆ టీమ్​లో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు'
"పాకిస్థాన్​తో పోలిస్తే భారత్​లో ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని నేను చెబుతాను. మ్యాచ్ విన్నర్ అంటే ఒంటి చేత్తో గేమ్ గెలిపించే ప్లేయర్. ప్రస్తుతం పాకిస్థాన్ లో మ్యాచ్ విన్నర్లు లేరు. టీమ్​ఇండియా బలం మిడిల్, లోయర్ బ్యాటర్లు. అందుకే భారత్ మ్యాచ్​లను గెలుస్తోంది. చాలా కాలంగా పాకిస్థాన్ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం. కానీ ఎవరూ స్థిరంగా రాణించడం లేదు. కొందరు కొన్ని మ్యాచ్​ల్లో రాణిస్తున్నారు. 50-60 మ్యాచ్​లలో నిలకడగా ఆడే ప్లేయర్స్​ పాక్​లో లేరు." అని అఫ్రిదీ వ్యాఖ్యానించాడు.

భారత్​పై గెలవాలంటే అదే కీలకం : అఫ్రిదీ
టీమ్​ఇండియా చాలా బలంగా ఉందని అఫ్రిదీ కొనియడాడు. నిలకడగా ఆడే బ్యాటర్ల విషయంలో భారత్​తో పోలిస్తే పాక్ జట్టు చాలా బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డాడు. భారత్​పై గెలవడానికి టీమ్​ మొత్తం బాగా పెర్ఫామ్​ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. బ్యాటర్లు, బౌలర్లు, స్పిన్నర్లు అందరూ రాణిస్తే భారత్​పై విజయం సాధించొచ్చని అభిప్రాయపడ్డాడు.

ఫుల్​ ప్రాక్టీస్
మరోవైపు, భారత్​తో ఆదివారం జరగనున్న మ్యాచ్​ కోసం పాకిస్థాన్ ప్లేయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మూడు గంటలపాటు ప్రాక్టీస్ చేశారు. పాక్ సీనియర్ బ్యాటర్ బాబర్ అజామ్ పలువురు బౌలర్లు వేసి బంతులను ఆడాడు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తప్ప మిగతా బ్యాటర్లందరూ 20 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అలాగే షహీన్ షా అఫ్రిదీ, హరిస్ రౌఫ్ చెరో ఏడు ఓవర్లు బౌలింగ్ చేశారు. పాకిస్థాన్ తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావేద్, కెప్టెన్ రిజ్వాన్ ఆటగాళ్లతో చర్చలు జరిపారు. ఆదివారం జరిగే మ్యాచ్​లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

ఇట్స్ రివెంజ్ టైమ్- పాకిస్థాన్​ను దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే

'రోహిత్ కుదురుకుంటే పాక్​కు చుక్కలే- 60 బంతుల్లోనే సెంచరీ చేసేస్తాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.