ETV Bharat / state

ఘనంగా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం - CRICKET TOURNAMENT IN PEERZADIGUDA

మెట్రో పాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ - ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు

Bar Association Cricket Tournament
Former MLC Ramachandra Rao, Justice Nagesh Beemapaka (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2025, 5:21 PM IST

Bar Association Cricket Tournament Hyderabad : మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్​ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ ప్రారంభించారు. ఉప్పల్ పీర్జాదిగూడలోని క్రికిట్ స్టేడియంలో రెండు రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగనుంది. ఈ టోర్నమెంట్​లో 13 బార్ అసోసియేషన్​ల న్యాయవాదులు పాల్గొంటున్నారు. ముగింపు కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ కార్తీక్​లు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

"అడ్వకేట్‌లంటే అబద్ధాలు ఆడాలి కానీ ఇంత అబద్ధాలు ఆడకూడదు. ఎందుకంటే నన్ను స్పోర్ట్స్‌మెన్‌ అంటే నాకే నవ్వు వచ్చింది. బంతి పట్టుకుని బౌలింగ్ వేయరాని వ్యక్తి, ఎన్నడూ బ్యాట్ పట్టుకోని వ్యక్తి, క్రికెట్ ఆడతావుంటే దూరం నుంచి చూసిన వ్యక్తి ఈ ఆటలను ప్రారంభించడమే గొప్ప హాస్యం. జీవితం ఒక ఆట దాన్ని అలానే ఆడుకోండి. గెలుపు ఓటములను స్పోర్టివ్‌గా తీసుకోవాలి అంతే" -జస్టిస్ నగేశ్ భీమపాక

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : వృత్తిపరమైన గెలుపు ఓటములను క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలని, క్రికెట్ టోర్నమెంట్​ను ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ సూచించారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వారు మధ్య వయసులో అడుగు పెట్టాక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానందుడి సూక్తులను ఉటంకించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌. రామచంద్రరావు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి, వివిధ బార్ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

స్టెతస్కోప్ వదిలి బ్యాట్ పట్టిన వైద్యులు - హైదరాబాద్​లో ఆకట్టుకున్న మహిళా డాక్టర్స్ క్రికెట్ లీగ్

న్యాయవాదుల క్రికెట్‌ విజేత తమిళనాడు.. నాలుగో స్థానంలో తెలంగాణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.