ETV Bharat / technology

పవర్​ఫుల్ ప్రాసెసర్, కిర్రాక్ ఫీచర్లతో 'రెడ్​మీ టర్బో 4'- దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే? - REDMI TURBO 4 LAUNCHED

అదిరే స్మార్ట్​ఫోన్​ను మార్కెట్లోకి దించనున్న రెడ్​మీ- పూర్తి వివరాలివే..!

Redmi Turbo 4
Redmi Turbo 4 (Photo Credit- mi.com)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 3, 2025, 3:49 PM IST

Redmi Turbo 4 Launched: రెడ్​మీ టర్బో 4 స్మార్ట్​ఫోన్ చైనా మార్కెట్లో లాంఛ్ అయింది. ఇది షావోమీ సబ్​-బ్రాండ్ ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్.​ కంపెనీ దీన్ని మీడియాటెక్ డైమెన్సిటీ 8400-అల్ట్రా చిప్‌సెట్‌తో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని భారత్​తో సహా ప్రపంపంచలోని ఇతర మార్కెట్​లలో 'పోకో X7 ప్రో' పేరుతో తీసుకురావచ్చు. ఈ స్మార్ట్​ఫోన్ ఇండియాలో ఈ జనవరి 9వ తేదీన ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా 'రెడ్​మీ టర్బో 4' మొబైల్​ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.

Redmi Turbo 4 స్పెసిఫికేషన్లు:

డిస్​ప్లే: ఈ ఫోన్ 6.67 అంగుళాల TCL Huaxing 1.5K ఫ్లాట్ OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz, పీక్ బ్రైట్​నెస్ 3200 నిట్స్. ఈ డిస్​ప్లే HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తుంది.

ప్రాసెసర్: ఈ ఫోన్‌లోని ప్రాసెసర్ కోసం కంపెనీ.. మీడియాటెక్ డైమెన్సిటీ 8400-అల్ట్రా చిప్‌సెట్‌ను అందించింది. ఈ ప్రాసెసర్ చాలా పవర్​ఫుల్.

కెమెరా: OIS సపోర్ట్​తో 50MP Sony LYT-600 మెయిన్ సెన్సార్ ఈ ఫోన్ వెనక భాగంలో అమర్చారు. ఫోన్ సెకండ్ బ్యాక్ కెమెరా 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. వీటితో పాటు ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 20MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్: ఈ కొత్త 'రెడ్​మీ టర్బో 4' స్మార్ట్​ఫోన్​లో 6,550mAh బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

సాఫ్ట్‌వేర్: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ HyperOS 2 పై రన్ అవుతుంది.

ఈ స్పెసిఫికేషన్‌లతో పాటు ఈ మొబైల్​ IP66/IP67/IP68 రేటింగ్, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS, మల్టీ-ఫంక్షన్ NFC వంటి అనేక ప్రత్యేక ఫీచర్లతో వస్తుంది.

కలర్ ఆప్షన్స్: కంపెనీ చైనా మార్కెట్లో దీన్ని మూడు కలర్ ఆప్షన్‌లలో లాంఛ్ చేసింది.

  • షాడో బ్లాక్
  • షాలో సీ బ్లూ
  • లక్కీ క్లౌడ్ వైట్

వేరియంట్స్ అండ్ ప్రైస్: కంపెనీ ఈ ఫోన్​ను నాలుగు వేరియంట్‌లలో తీసుకొచ్చింది. దీని ధర CNY 1,999 (దాదాపు రూ. 23,488). దీనిలో వినియోగదారులు 12GB RAM + 256GB స్టోరేజ్​ను పొందుతారు. దీని టాప్ వేరియంట్ 16GB RAM + 512GB స్టోరేజీతో వస్తుంది. దీని ధర CNY 2,499 (సుమారు రూ. 29,363).

కంపెనీ ఈ స్మార్ట్​ఫోన్​ను 'పోకో X7 ప్రో' పేరుతో తీసుకొస్తే.. దీని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు దాదాపు చైనా వేరియంట్ 'రెడ్​మీ టర్బో 4' మాదిరిగానే ఉండొచ్చు. దీని ధర కూడా ఇంచుమించూ ఇలానే ఉండే అవకాశం ఉంది.

అద్భుతమైన డిజైన్, ప్రీమియం ఫీచర్లతో కియా సిరోస్- బుకింగ్స్ స్టార్ట్- కేవలం రూ.25,000 చెల్లిస్తే చాలు!

BSNL యూజర్లకు షాకింగ్ న్యూస్!- సంక్రాంతి నుంచి ఆ సర్వీసులు బంద్!

లో కాస్ట్.. హై పెర్ఫార్మెన్స్: ఈ బైక్స్ వేరే లెవల్​ బ్రో- 400cc సెగ్మెంట్లో టాప్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.