Horoscope Today February 12th 2025 : 2025 ఫిబ్రవరి 12వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
![](https://assets.eenadu.net/article_img/1mesham_44.jpg)
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు శుభవార్తలు వింటారు. బంధువులను కలుసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
![](https://assets.eenadu.net/article_img/2vrushabham_45.jpg)
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరమైన ఆందోళన, ఒత్తిళ్లు చుట్టుముడతాయి. మీ స్వధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఆటంకాలను అధిగమిస్తారు. మిత్రుల సహాయంతో ఆర్ధికంగా బలోపేతం అవుతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
![](https://assets.eenadu.net/article_img/3mithunam_42.jpg)
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. బంధువులు,ప్రియమైన వారితో, ఉత్సాహంగా గడుపుతారు. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ఆర్ధిక సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆర్థిక లబ్ధి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలం. ఇష్ట దేవతారాధనతో శుభఫలితాలు ఉంటాయి.
![](https://assets.eenadu.net/article_img/4karkatakam_39.jpg)
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రారంభించిన పనుల్లో సహనం, పట్టుదల అవసరం. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సమయానికి రావలసిన డబ్బులు అందక ఇబ్బంది పడతారు. ప్రతికూల ఆలోచనలతో సమయం వృథా చేయకండి. ఓ సంఘటన విచారం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.
![](https://assets.eenadu.net/article_img/5simham_41.jpg)
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీకు మనఃసాఖ్యం కలిగించే అనేక ఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ రోజంతా సరదాగా, ఆనందంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శివారాధన శ్రేయస్కరం.
![](https://assets.eenadu.net/article_img/6kanya_44.jpg)
కన్య (Virgo) : కన్యరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. స్థాన చలనం ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆర్ధికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. సంపద ప్రాప్తిస్తుంది. ప్రశాంతమైన ప్రయాణం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇష్ట దేవతారాధన శుభకరం.
![](https://assets.eenadu.net/article_img/7tula_41.jpg)
తుల (Libra) : తులారాశి వారికీ ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఊహించని శుభవార్తలతో ఇంట్లో ఆనందకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది. ఉద్యోగస్తులు తమ శక్తియుక్తులతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ప్రమోషన్ కోసం చూస్తున్న ఎదురుచూపులకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. సన్నిహితుల సలహాలు మేలు చేస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/8vrutchikam_42.jpg)
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉంటాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ జీవితం అనుకోని మలుపులు తిరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయవద్దు. కార్యసిద్ధి హనుమ ఆరాధన ఉత్తమం.
![](https://assets.eenadu.net/article_img/9danassu_40.jpg)
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరగడంతో తీరిక లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా , మర్యాదపూర్వకంగా ఉండండి. బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సంపద వృద్ధి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.
![](https://assets.eenadu.net/article_img/10makaram_43.jpg)
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. కమిషన్, వ్యాపారం, వడ్డీ, రుణాలు, పెట్టుబడులు, మీ ఆదాయాన్ని పెంచుతాయి. షేర్ మార్కెట్లో భారీ లాభాలను అందుకుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. శ్రీ సుబ్రబహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం శ్రేయస్కరం.
![](https://assets.eenadu.net/article_img/11kumbam_43.jpg)
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి. అన్ని రంగాల్లో విజయాన్ని చూస్తారు. సమయాన్ని వృధా చేయవద్దు. పరపతికి భంగం కలిగే పనులు చేయవద్దు. చంచల నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. శని స్తోత్రాలు పఠించడం ఉత్తమం.
![](https://assets.eenadu.net/article_img/12meenam_44.jpg)
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఆటంకాలను సమర్ధవంతంగా అధిగమిస్తారు. సృజనాత్మకతతో అందరి ప్రశంసలు అందుకుంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో ఒత్తిడి పెరగవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఈశ్వర ఆలయ సందర్శనం శుభకరం.