ETV Bharat / spiritual

గోళ్లను ఈ రోజుల్లో కట్ చేయకూడదట - దరిద్రాన్ని ఆహ్వానించినట్టేనంటున్న జ్యోతిష్యం! - NAILS CUTTING AS PER ASTROLOGY

- వారంలో ఆ 3 రోజుల్లో మాత్రమే కత్తిరించాలని సూచన!

Astrology Tips for Nails Cutting
Nails Cutting (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2025, 7:33 PM IST

Astrology Tips for Nails Cutting : కొందరికి నెయిల్స్ పెంచడం అంటే చాలా ఇష్టం. కానీ, ఇంకొందరు మాత్రం కాస్త గోళ్లు పెరిగినా చిరాగ్గా ఫీల్ అవుతుంటారు. దాంతో ఖాళీ సమయం దొరికినప్పుడు నెయిల్​ కట్టర్​తో కట్ చేసుకోవడం చేస్తుంటారు. కానీ, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గోళ్లు ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేసుకోవడం మంచిది కాదట. ఒకవేళ అలా చేస్తే దరిద్రం వెంట తెచ్చుకున్నట్లేనట. అలాగని గోళ్లను ఎక్కువగా పెంచుకోవద్దు. దీనికి వెనుక పురాణాలలో ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. మరి, ఇంతకీ గోళ్లను వారంలో ఏ రోజుల్లో తీసుకుంటే మంచిది? ఎందుకు పెంచుకోవద్దో ఇప్పుడు చూద్దాం.

మన శరీరంలో గోళ్లు మృతకణాలకు ప్రతీక. కణ విభజన నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇందులో మృతకణాలు కొన్ని జుత్తుగా, మరికొన్ని నెయిల్స్​గా పెరుగుతాయి. అందుకే, వీటిని తొలగించే క్రమంలో ప్రత్యేకమైన తిథులు, వారాలను పాటించాల్సి ఉంటుందట. ఎప్పుడైనా స్నానానికి ముందే నెయిల్స్​ తీసుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లో కాకుండా ఇంటి బయట గోళ్లు కట్ చేసుకోవాలి. ఎందుకంటే అసలు జీర్ణమవ్వని పదార్థాల్లో గోళ్లు, వెంట్రుకలు తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి, నెయిల్స్ ఇంట్లో తీస్తే తొక్కినా, అన్నంలో కలిసినా సమస్యలొస్తాయని గుర్తుంచుకోవాలంటున్నారు.

ఈ రోజుల్లో కట్ చేసుకోవద్దు!

గోళ్లు కట్ చేసుకునే విషయంలో కొన్ని నియమాలు పాటించాలంటున్నారు జ్యోతిష్యులు. ముఖ్యంగా మంగళ, గురు, శనివారాల్లో నెయిల్స్ కట్ చేసుకోవడం మంచిది కాదంటున్నారు. ఎందుకంటే ఆయా రోజుల్లో గోళ్లు తీసుకోవడం వల్ల కుజుడు, గురు, శని గ్రహాలు అశుభ ఫలితాలను ఇవ్వడం మొదలుపెడతాయట. ఆ రోజుల్లో తీసుకోవడం కారణంగా గ్రహాల అశుభ ప్రభావం మీపై పడుతుందట. దాంతో మీరు పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు జ్యోతిష్యులు. అలాగే, సూర్యాస్తమయం తర్వాత నెయిల్స్ కత్తిరించడం మంచిది కాదట.

ఈ 3 రోజులు మంచిది!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గోళ్లు కత్తిరించుకోవడానికి సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు మంచివట. అలాగే, ఎప్పుడూ పగటిపూట మాత్రమే నెయిల్స్ కత్తిరించుకోవాలి. ఈ మూడు రోజుల్లో నెయిల్స్ కట్ చేసుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందంటున్నారు జ్యోతిష్యులు.

ఎందుకు పెంచుకోవద్దంటే?

మానవుడు చేసే పాపాలు ఎక్కువ జుట్టు, గోళ్లను ఆశ్రయించి ఉంటాయట. అందుకే వీటిని తొలగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరని సూచిస్తున్నారు. అంతేకాదు, గోళ్లను అతిగా పెంచుకోవడం కూడా అంత మంచిది కాదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఇందుకు వేదాల్లో ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే పాపాలన్నీ సూర్యుడి దగ్గరికి వెళ్లగా, అప్పుడు ఆయన వాటిని తన దగ్గర ఉండకూడదని తిరిగి వెళ్లిపోండని అన్నాడట. దాంతో పాపాలు ఎక్కడికి పోవాలి? అని సూర్యుడిని అడిగితే గోళ్లను ఆశ్రయించమని చెప్పాడట. ఈ కథనం ఆధారంగా గోళ్లను పెంచుకోకూడదని ఒక నియమం పెట్టారట.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవీ చదవండి :

జ్యోతిష్యశాస్త్రం కీలక సూచన - హెయిర్ కటింగ్, షేవింగ్ - ఈ రోజుల్లో అస్సలే చేయించవద్దట!

"చేతిలో పైసా మిగలట్లేదా? - మిరియాలతో శక్తివంతమైన పరిహారం చేస్తే ధన ప్రవాహమే"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.