5కిలోల 'బాహుబలి' నిమ్మకాయలను పండిస్తున్న రైతు- ఎక్కడంటే? - 5 కిలోలున్న అరుదైన నిమ్మకాయలు
🎬 Watch Now: Feature Video


Published : Dec 24, 2023, 1:42 PM IST
Big Size Lemon Cultivation In Karnataka : బాహుబలి నిమ్మకాయలను పండిస్తున్నారు కర్ణాటకకు చెందిన ఓ రైతు! 5 కిలోల, 6 అడుగుల భారీ నిమ్మకాయలను తన కాఫీ తోటలో సాగు చేస్తున్నారు. వీటిని ఆర్గానిక్ పద్ధతిలోనే ఆయన పండించడం విశేషం.
కొడగు జిల్లాలోని పలిబెట్ట ప్రాంతానికి చెందిన విజు సుబ్రమణి ఈ భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. 'నాలుగేళ్ల క్రితం ఓ రోజు మైసూర్ మార్కెట్కు వెళ్లినప్పుడు నిమ్మచెట్టు విత్తనాలను కొనుగోలు చేశాను. ఆ తర్వాత వాటిని నా ఇంటికి సమీపంలో ఉన్న గార్డెన్లో నాటాను. పెరిగిన మొక్కలను తీసి కాఫీ తోటలో సాగు చేశాను. అయితే మూడేళ్లకు నిమ్మచెట్లు పెరిగి పెద్దవయ్యాయి. అయినప్పటికీ ఆ చెట్లకు నిమ్మ పువ్వులు, కాయలను గానీ కాయలేదు. దీంతో ఆ చెట్టు నిమ్మచెట్టా? కాదా అనే అనుమానం కలిగింది. అక్కడికే కొద్ది రోజులకే పంట రావడం మొదలైంది. కొన్ని నెలల తర్వాత అవి పెద్దవిగా మారి భారీ పరిమాణంలో కాశాయి' అని విజు సుబ్రమణి తెలిపారు.