Bharat Biotech Krishna and Suchitra Ella Visit Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత్ బయోటెక్ ఎండీ, జేఎండీ - bharat biotech md visit ttd
🎬 Watch Now: Feature Video
Published : Sep 3, 2023, 1:21 PM IST
|Updated : Sep 3, 2023, 4:17 PM IST
Bharat Biotech Krishna and Suchitra Ella Visit Tirumala: తిరుమల శ్రీవారిని భారత్ బయోటెక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా, జాయింట్ డైరెక్టర్ ఎల్లా సుచిత్ర దర్శించుకున్నారు. ఈ రోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీడీడీ ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో వారు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం అందచేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 18 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 81,655 మంది భక్తులు దర్శించుకోగా.. 38,882 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం 3.84 కోట్ల రూపాయలు వచ్చింది.
TAGGED:
tirumala temple latest news