Cancer Prevention Foods: ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇందుకు రోజూ మనం తీసుకునే ఆహారం, పాటించే జీవనశైలి మార్పులే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని.. కానీ చాలామంది చివరి దశలో గుర్తించి తమ జీవితాన్నే కోల్పోతున్నారని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చక్కటి జీవనశైలిని పాటించడంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రకలీ: ప్రొస్టేట్, పెద్దపేగు, మూత్రాశయ క్యాన్సర్‌ను నిరోధించడంలో ఇది సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే సల్ఫోరాఫాన్ శరీరంలోని రక్షణాత్మక ఎంజైమ్‌లను ప్రేరేపించి విషతుల్య మలినాలను తొలగిస్తుందని వివరిస్తున్నారు. ఇంకా బ్రకీలీలో ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుందని పేర్కొన్నారు.
నారింజ: ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేగాక చెడు కొలెస్ట్రాల్, బరువును తగ్గిస్తుందని వివరిస్తున్నారు. ఇవేకాకుండా చర్మాన్ని కూడా మృదువుగా ఉంచుతుందని అంటున్నారు.
గ్రీన్ టీ: ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌లు అన్నవాహిక, ఊపిరితిత్తులు, నోటి, పాంక్రియాటిక్ క్యాన్సర్‌ను అడ్డుకుంటాయని నిపుణులు అంటున్నారు. ఇంకా ఇందులో ఉండే పాలీఫినాల్స్ కొత్త కణాలను భర్తీ చేస్తాయని వివరిస్తున్నారు.
అల్లం: ఇది క్యాన్సర్ కణాలను తమంత తాముగా నశించేటట్లు చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా అండాశయ క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుందని చెబుతున్నారు. అంతేగాక ఈ కణాలు విస్తరించే శక్తిని కూడా అడ్డుకుంటుందని అంటున్నారు. 2015లో Journal of Nutrition and Cancerలో ప్రచురితమైన "Ginger: A Novel Anti-Cancer Agent"లో ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
వెల్లుల్లి: వెల్లుల్లిలో అనేక రకాల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇవి క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో చక్కగా పనిచేస్తాయని వివరిస్తున్నారు. కణాలు పెరగకుండా చేసి.. రొమ్ము, పెద్ద పేగు, పొట్ట, అన్నవాహిక క్యాన్సర్‌లను నిరోధిస్తుందని చెబుతున్నారు.
యాపిల్: ప్రతి రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదని చాలా మంది అంటుంటారు. క్యాన్సర్ విషయంలో కూడా ఇది నిజమేనిని నిపుణులు చెబుతున్నారు. రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్‌ల నివారణలో యాపిల్స్ కీలక పాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు.
సాల్మన్ చేపలు: ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అంతేగాక వివిధ విటమిన్‌లు, ప్రొటీన్లు, సెలీనియం కూడా లభ్యమవుతుందని చెబుతున్నారు. ఇవన్నీ కాలేయ క్యాన్సర్‌ను నిరోధించడంలో తోడ్పడతాయని.. గుండెపోటును కూడా అడ్డుకుంటాయని వివరిస్తున్నారు.
కాయధాన్యాలు: బీన్స్, చిక్కుడు మొదలైన కాయధాన్యాలు రొమ్ము క్యాన్సర్‌ను బాగా అడ్డుకుంటాయని నిపుణులు అంటున్నారు. ఇవి క్యాన్సర్‌ను నిరోధించే ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయని వివరిస్తున్నారు.
దానిమ్మ: ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన పాలీఫినాల్‌ను కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పాలీఫినాల్ రొమ్ము క్యాన్సర్‌ను పెరగకుండా చూస్తుందని వివరిస్తున్నారు.
పసుపు: క్యాన్సర్‌ను సమర్థంగా నిరోధించడంలో పసుపు సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రొమ్ము, పేగు, చర్మ సంబంధిత క్యాన్సర్ కణాలను ఇది నిర్వీర్యం చేస్తుందని వివరిస్తున్నారు. క్యాన్సర్ కారక కణాలతో ఇది సమర్థంగా పోరాడుతుందని అంటున్నారు.
మిరియాలు: ఇందులోని క్యాప్‌సైసిన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్‌ను కలిగించే కణాలను నిర్మూలిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని కూరగాయలతో కలిపి తీసుకుంటే మేలు జరుగుతుందని అంటున్నారు.
క్యారట్: క్యారట్లో క్యాన్సర్‌ను నిరోధించే బయోఫ్లేవనాయిడ్స్, ఆల్ఫా కెరోటిన్‌లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నిరోధించడానికి క్యారట్లు ఎంతగానో తోడ్పడతాయని వివరిస్తున్నారు.
ద్రాక్ష: ఇందులోని ఎలాజిక్ యాసిడ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పర్యావరణంలోని విష పదార్థాలు శ్వాస వ్యవస్థకు హాని చేయకుండా ఎలాజిక్ యాసిడ్ రక్షణ కల్పిస్తుందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఛాతీలో నొప్పా? గుండె పట్టేసినట్లుగా ఉంటుందా? ఈ గ్యాస్, ఎసిడిటీ సమస్యకు ఏం తింటే బెటర్?
సూది, రక్తం లేకుండానే షుగర్ టెస్ట్! ఈజీగా వాచ్‌తోనే చెక్ చేసుకోవచ్చట!!