లాభాపేక్ష లేకుండా రోగులకు చికిత్స అందించడమే లక్ష్యం : బసవతారకం ఆస్పత్రి సీఈవో - Basavatarakam Hospital New CEO Interview

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 10:21 AM IST

Basavatarakam Hospital New CEO Interview  : యూకేలో ఆర్థోపెడిక్ సర్జన్ గా పట్టా పొందారు. ఆర్థోపెడిక్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించటమే కాదు మరెందరో మంచి వైద్యులను సమాజానికి అందించిన ఘనత ఆయనది. వైద్య రంగంలో నలభై ఏళ్లపాటు సేవలు అందించటంతోపాటు గత 30 ఏళ్లుగా సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న పేద చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ నేటి తరం వైద్యులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే డాక్టర్ కూరపాటి కృష్ణయ్య. మంగళవారం రోజున బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సీఈవోగా ఆయన బాధ్యతలు చేపట్టారు.  

Basavatarakam Hospital New CEO Dr Kurapati Krishnaiah : అనంతరం ఆయన మాట్లాడుతూ బసవతారకంలో తక్కువ ఖర్చుతో అధునాతన వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ కృష్ణయ్య తెలిపారు. లాభాపేక్ష లేకుండా రోగులకు చికిత్స అందించడమే లక్ష్యమని వెల్లడించారు. 20 సంవత్సరాల్లో 30లక్షల మందికి వైద్య సేవలు అందినట్లు స్పష్టం చేశారు. కనీసం 40శాతం రాయితీతో రోగులకు సేవలు అందిస్తునట్లు చెప్పారు. పేదలకు వైద్యం మరింత చేరువ చేస్తూ ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఆస్పత్రి సీఈవోగా తన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తిస్తానంటున్న డాక్టర్ కూరపాటి కృష్ణయ్యతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.