Ayodhya Ram Mandir Replica : కలపతో అయోధ్య రామమందిర నమూనా.. దీపావళికి కానుకగా.. - replica of ram mandir ayodhya
🎬 Watch Now: Feature Video
Ayodhya Ram Mandir Replica : గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన హన్స్ ఆర్ట్ అనే సంస్థ.. అయోధ్య రామమందిర నమూనాలను అందంగా తయారు చేస్తోంది. కలపతో తయారు చేసిన ఈ మందిరాలు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటి కొనుగోలుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తుండటం వల్ల వీటి విక్రయాలు బాగా పెరిగాయి.
ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశంతో అయోధ్య ఆలయ నమూనాలు తయారు చేసి విక్రయిస్తున్నామని హన్స్ ఆర్ట్ సంస్థ తెలిపింది. 'మా సంస్థ పక్షులను రక్షించడానికి పక్షుల గూళ్లను తయారుచేస్తుంది. ఆ గూళ్లను ఉచితంగా పంపిణీ చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ రామమందిర కలను సాకారం చేశారు. అందుకే మేము కూడా కలపతో రామమందిర నమూనాను నిర్మించాం. దీపావళికి కానుకగా ఈ మోడల్స్‌ను విడుదల చేస్తాం. ఇప్పటికే 300-400 వరకు ఆర్డర్లు వచ్చాయి.' అని పేర్కొంది. హన్స్ ఆర్ట్.. పక్షుల సంరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ. పక్షుల కోసం గూళ్లను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుంటుంది.