Video Viral : పెళ్లి రిసెప్షన్ వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు
🎬 Watch Now: Feature Video
Young Boy Died While Dancing at a Wedding Reception: ఇటీవల గుండెపోటు రావడం సర్వసాధారణమైపోయింది. చాలా మంది యువకులు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్లు అలా కుప్పకూలిపోవడానికి కారణం గుండెపోటు అని ఆస్పత్రికి తీసుకువెళ్లేదాకా తెలియడం లేదు. ఈమధ్య గుండెపోటుతో యువత ఎక్కువగా చనిపోతున్నారు.
ఇటీవలే హైదరాబాద్‌లో జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఓ కానిస్టేబుల్ కుప్పకూలిన సంఘటన మరవకముందే మరో యువకుడు పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో పెళ్లి వేడుకలో ఈ విషాదం చోటు చేసుకుంది. యువకుడి మృతితో ఆ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బారాత్‌లో పెళ్లి కుమారుని సమీప బంధువైన మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం అనే యువకుడు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలి పడిపోయాడు. గమనించిన స్థానికులు యువకుడిని లేపి పరిశీలించగా ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. హుటహూటిన వైద్య సేవల కోసం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈనెల 24న హైదరాబాద్‌లో విశాల్ అనే కానిస్టేబుల్లో జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తూ సడెన్‌గా కుప్పకూలాడు. క్షణాల్లో ఆ నొప్పి తట్టుకోలేక ప్రాణాలు వదిలాడు. అక్కడే ఉన్న వాళ్లు గమనించి ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే అతడు గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. అంతకుముందు ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి విషాదం చోటుచేసుకుంది. పెళ్లి జరుగుతుండగా పెళ్లికుమారుడు అకస్మాత్తుగా కుప్పకూలాడు. ఏడడుగులు వేస్తుండగానే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా యువతీయువకులు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇటీవల గుండెపోటు ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురిచేస్తోంది. యువత నుంచి వృద్ధుల వరకు చాలా మంది అకస్మాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో మరణిస్తున్నారు. కొందరు చాలా ఫిట్‌గా ఉన్నా గుండెపోటుకు గురవుతున్నారు. అయితే రోజూ తీసుకునే ఆహారం, జీవనశైలి, అనవసరపు ఒత్తిడే ఇలా అకస్మాత్తుగా గుండెపోటు రావడానికి కారణమవుతోందని వైద్యులు చెబుతున్నారు. చిన్నతనంలోనే గుండెపోటు రాకుండా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.