ETV Bharat / sports

'అక్కడ ఆట అంత ఈజీ కాదు - మిడిల్ ఓవర్లలో బాగా పెర్ఫామ్​ చేసిన టీమ్​దే విజయం' - IND VS PAK CHAMPIONS TROPHY 2025

'మిడిల్ ఓవర్లలో బాగా ఆడిన టీమ్​దే విజయం' : శుభ్‌మన్ గిల్

IND vs PAK Champions Trophy 2025
IND vs PAK Champions Trophy 2025 (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 23, 2025, 8:08 AM IST

IND vs PAK Champions Trophy 2025 : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అసలైన మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. దుబాయ్​ వేదికగా భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. 2017 ఫైనల్ ఓటమికి రివెంజ్​ తీర్చుకోవాలని టీమ్ఇండియా భావిస్తుండగా, ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ ఆశలను నిలబెట్టుకోవాలని పాక్​ కూడా పట్టుదలతో ఉంది.

ఇక రోహిత్ సేన కూడా ఈ మ్యాచ్​ కోసం భారీగానే ప్రాక్టీస్ చేస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందరికంటే రెండు, మూడు గంటల ముందు నుంచే ప్రాక్టీస్ సెషన్స్‌లో చెమటోడుస్తున్నాడు. స్పిన్నర్లను ఎదుర్కొంటూ తన బలబలాలను పరీక్షించుంటున్నాడు. మిగతా ప్లేయర్స్​ కూడా నెట్స్​లో తీవ్రంగా శ్రమించారు.

కానీ, వికెట్‌కీపర్ రిషభ్‌ పంత్ ప్రాక్టీస్ సెషన్స్‌కు రాలేదు. వైరల్‌ ఫీవర్‌ కారణంగా పంత్ రెస్ట్ తీసుకుంటున్నాడని, అందుకే ప్రాక్టీస్‌కు రాలేదంటూ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వైస్‌ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్లారిటీ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌కు ఛాన్స్​ దక్కలేదు. ఒక వేళ పాక్‌తో మ్యాచ్‌ వరకు అతడు ఫిట్‌గా ఉంటే తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

"దుబాయ్‌లో టాస్‌ ఏమాత్రం కీలకం కాదు. ఎందుకంటే ఇక్కడ మంచు ప్రభావం అస్సలు లేదు. దీంతో మనకు ఛేజింగ్‌ కష్టమవుతోంది. భారత్-పాకిస్థాన్ క్రికెట్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. రెండు జట్ల మధ్య పోరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఎంతో ముఖ్యమైన మ్యాచ్‌. అయితే ఫైనల్‌ మ్యాచ్‌ ఇంకా ఇంపార్టెంట్​. మంచు లేకుండా ఫ్లడ్ లైట్ల కింద బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. స్ట్రైక్‌ రొటేట్ చేయడం కూడా సులభం కాదు. మిడిల్ ఓవర్లలో ఎవరు బాగా రాణిస్తారో వారికే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ సారి కచ్చితంగా మేము దూకుడుగా ఆడాలనే అనుకుంటున్నాం. ఆ పిచ్‌ ఎలా స్పందిస్తుంది అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ పిచ్‌పై మేం 300 లేదా 280 పరుగులు చేస్తే సరిపోతుందని అనుకుంటున్నా. పిచ్ సపోర్ట్​ చేస్తే 350-360 పరుగులు చేస్తాం" అని గిల్ అసలు విషయాన్ని వివరించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 'గోల్డెన్‌ బ్యాట్​' - వరుస ఎడిషన్లలో సాధించిన ఏకైక భారత క్రికెటర్​ అతడే!

ఛాంపియన్స్‌ ట్రోఫీ : 8-8-8 ఫార్ములా- ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.