Mastan Sai Hard Disk : యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో అరెస్టయిన మస్తాన్ సాయి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 499 వీడియోలు లభ్యంకాగా ఇందులో సగానికి పైగా నగ్నంగా యువతుల వీడియోలు ఉన్నాయి. విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించగా హార్డ్‌డిస్కులోని వీడియోల గురించి కీలక సమాచారం తెలిసింది.
హార్డ్‌డిస్కులో 499 వీడియోలు : నిందితుడి ముందే హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి వివరాలు రాబట్టారు. అందులో మొత్తం 499 వీడియోలు ఉన్నాయి. ఆరుగురు యువతులు వీడియోకాల్స్ మాట్లాడినప్పుడు వారికి తెలియకుండా స్క్రీన్ రికార్డింగ్ చేశాడు. వీటితో పాటు యువతులతో తన గదిలో ప్రైవేటుగా ఉన్న సందర్భాలను రహస్యంగా రికార్డు చేసి భద్రపరుచుకున్నాడు. లావణ్య, ఆమె స్నేహితుల్ని కూడా నిందితుడు లోబర్చుకున్నాడు. దాదాపు మూడేళ్ల నుంచి ఇలా రహస్యంగా సేకరించిన ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. హార్డ్‌డిస్కులో ఇతరుల ఫోన్లను హ్యాక్ చేసేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
డ్రగ్స్‌పై మౌనం : పోలీసులు కస్టడీ సందర్భంగా డ్రగ్స్ కొనుగోలు గురించి ప్రశ్నించగా మస్తాన్ సాయి నోరు విప్పలేదు. మస్తాన్ సాయి మీద గతంలో రెండు డ్రగ్స్ కేసులు ఉన్నాయి. హార్డ్‌డిస్కులో ఉన్న వీడియోల్లో డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్న వ్యక్తులెవరో పరిశీలించి చెబుతానని పోలీసులకు చెప్పాడు.
కాలేజీ రోజుల్లోనే డ్రగ్స్ : ఏపీలోని గుంటూరు జిల్లా నల్ల చెరువుకి చెందిన మస్తాన్ సాయి ఇంజినీరింగ్ చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. బీటెక్ చదివే సమయంలోనే డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. అప్పటి నుంచే డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గుంటూరు, హైదరాబాద్ మధ్య తిరుగుతూ సినీ పరిశ్రమకు చెందినవారిని పరిచయం చేసుకున్నాడు. మస్తాన్ సాయిపై 2023 సెప్టెంబరులో రాజేంద్రనగర్ ఎస్‌వోటీ, మోకిల పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న కేసులో అరెస్టు చేశారు. అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది. ఆ కేసులో మస్తాన్ సాయి ఏ4గా ఉన్నాడు.
మస్తాన్ సాయి కేసు - రంగంలోకి యాంటీ నార్కోటిక్స్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్
మత్తులోకి జారుకున్న అనంతరం లైంగిక దాడి - బయటపడుతున్న మస్తాన్ సాయి అరాచకాలు