ETV Bharat / state

ఎస్​ఎల్​బీసీ టన్నెల్​లో సహాయక చర్యలు - 13.5 కి.మీ వరకు వెళ్లిన రెస్క్యూ టీం - SLBC TUNNEL ACCIDENT UPDATE

ఎస్​ఎల్​బీసీ సొరంగం ప్రమాదం - సహాయక చర్యలు చేస్తున్న ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు

SLBC TUNNEL ACCIDENT UPDATE
SLBC TUNNEL ACCIDENT UPDATE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2025, 8:00 AM IST

SLBC Tunnel Accident Update : ఎస్​ఎల్​బీసీ టన్నెల్​లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో 24 మందితో కూడిన ఇండియన్​ ఆర్మీ టీం, రెస్క్యూ టీం, 130 మంది ఎన్డీఆర్​ఎఫ్​ బృందం, 24 మందితో కూడిన హైడ్రా, సింగరేణి కాలరీస్​ నుంచి 24 మందితో రెస్క్యూ టీం, 120 మంది ఎస్​డీఆర్​ఎఫ్​ టీం పాల్గొన్నాయి. సహాయక చర్యలకు ఘటనాస్థలిలో కూలిన మట్టి, నీటితో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

ఎస్​ఎల్​బీసీ సొరంగం మార్గంలో 14వ కిలోమీటర్​ వద్ద పైకప్పు కూలింది. 13.5 కిలోమీటర్ల వరకు సహాయ బృందాలు వెళ్లాయి. మరో అర కిలోమీటర్​ వెళ్లేందుకు మట్టి, నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అడ్డంకులను అధిగమించి ఘటనాస్థలికి చేరుకునేందుకు సహాయక బృందాలు యత్నిస్తున్నాయి. 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్​లో ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు వెళ్లాయి. 11 కిలోమీటర్ల నుంచి 3 అడుగుల మేర వరకు నీరు నిలిచిపోయి ఉందని బృందాలు తెలిపాయి. 11 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది నడుచుకొని వెళ్లారు. ఆ తర్వాత టన్నెల్​ బోరింగ్​ మిషన్​ వద్దకు ఎన్డీఆర్ఎఫ్​ బృందాలు చేరుకున్నాయి.

నీటి ఉద్ధృతికి 80 మీటర్లు వెనక్కి వచ్చిన టన్నెల్​ బోరింగ్ : నీటి ఉద్ధృతికి 80 మీటర్ల వెనక్కి టన్నెల్​ బోరింగ్​ మిషన్​ వచ్చిందని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి.. టీబీఎం వెనక్కి రావడంతో 200 మీటర్ల గ్యాప్​ ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ 200 మీటర్ల గ్యాప్​లోనే 8 మంది చిక్కుకున్నారని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. చిక్కుకున్న వారిని పిలుస్తూ స్పందన కోసం ఈ బృందాలు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రెస్క్యూ బృందాలకు టీబీఎం వెనుక భాగం కనిపించింది. పైకప్పు కూలడంతో మట్టితో టీబీఎం కూరుకుపోయింది. టీబీఎంకు ముందు భాగంలో 8 మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. ఇద్దరు ఇంజినీర్లు, టీబీఎం ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఇందులోనే చిక్కుకున్నారు.

ఎస్​ఎల్​బీసీ వద్దకు మంత్రి ఉత్తమ్​ : నిరంతరాయంగా సహాయక చర్యలను బదావత్​ సంతోశ్​, వైభవ్​ గైక్వాడ్​ పర్యవేక్షిస్తున్నారు. జేఏసీ క్యాంప్​ కార్యాలయనికి మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి చేరుకున్నారు. సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ఎస్​ఎల్​బీసీకి మంత్రి వచ్చారు.

సీఎంకు రాహుల్​ గాంధీ ఫోన్​ : ఎస్​ఎల్​బీసీ ప్రమాదంపై సీఎం రేవంత్​ రెడ్డికి రాహుల్​ గాంధీ ఫోన్​ చేసి వివరాలు అడిగారు. సుమారు 20 నిమిషాలు మాట్లాడిన ఆయన, ప్రమాద వివరాలు, చేయాల్సిన సహాయక చర్యలపై చర్చించారు. ఘటన జరగ్గానే మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి ప్రమాద స్థలికి వెళ్లారని, రాష్ట్ర, కేంద్ర విపత్తు సహాయ బృందాలు రెస్క్యూ ఆపరేషన్​ చేస్తున్నాయని వివరించారు. క్షతగాత్రులకు వైద్య ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాట్లను రాహుల్​ అభినందించారు. టన్నెల్​లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేయాలని సీఎం రేవంత్​కు సూచించారు.

ఎస్​ఎల్​బీసీ సొరంగ ప్రమాదం - 12 కి.మీ వరకే లోపలికి వెళ్లవచ్చు, ఆ తర్వాత కష్టమే!

సహాయక చర్యలపై ఆదివారం సాయంత్రం వరకు స్పష్టత వస్తుందన్న ఉత్తమ్ - రంగంలోకి ఆర్మీ ఇంజినీర్ టాస్క్​ఫోర్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.