56 ఏళ్ల వయస్సులోనూ అదిరిపోయే ఫిట్‌నెస్ విదేశీయులకు ఆన్లైన్లో ట్రైనింగ్ - World body builder Avtar Singh
🎬 Watch Now: Feature Video
పంజాబ్‌లోని లూధియానాకు చెందిన అవతార్ సింగ్ 56 ఏళ్ల వయసులోనూ బాడీ బిల్డింగ్‌లో అదరగొడుతున్నారు. 53 ఏళ్ల వయస్సులోనే ఆయన వెయిట్ లిఫ్టింగ్, బాడీబిల్డింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. రెండు సార్లు ఆయన ఈ ఘనత సాధించారు. కరోనా సమయం నుంచి ఆన్లైన్లో సైతం ఫిట్‌నెస్ కోచింగ్ ఇస్తున్నారు అవతార్ సింగ్. భారత్‌లోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియాలోని వారికీ ఈయన ఫిట్‌నెస్ మెలకువలు నేర్పుతున్నారు. సొంతంగా జిమ్ సెంటర్ ప్రారంభించి బాడీబిల్డింగ్‌లో శిక్షణ అందిస్తున్నారు. యువతతో పాటు 40 ఏళ్లు పైపడ్డవారూ ఈ జిమ్ సెంటర్‌కు వస్తుంటారు. ఫిట్‌నెస్ అనేది ఎవరికైనా చాలా ముఖ్యమని, శరీరం కంటే విలువైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదని అవతార్ చెబుతున్నారు. అందుకే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అంటున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST