350 Years Old Yeola Horse Market : 350 ఏళ్ల గుర్రాల మార్కెట్​.. దరువుకు తగ్గట్లు డ్యాన్సులు చేస్తున్న అశ్వాలు - అతిపెద్ద గుర్రాల మార్కెట్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 11:41 AM IST

350 Years Old Yeola Horse Market : 350 ఏళ్ల చరిత్ర కలిగిన అతిపెద్ద గుర్రాల మార్కెట్​ సందడిగా సాగింది. నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన మార్కెట్​కు.. దేశం నలుమూలల నుంచి గుర్రాలు వచ్చాయి. మహారాష్ట్ర నాశిక్​లోని యెవలాలో 17వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఈ మార్కెట్​ను ఏటా దసరా ముందు మంగళవారం ఘనంగా నిర్వహిస్తారు. మార్కెట్​కు వచ్చిన గుర్రాలు నృత్యాలు అందర్ని ఆకట్టుకున్నాయి. దరువులకు తగ్గట్లుగా డ్యాన్స్ చేశాయి గుర్రాలు.

ఈ మార్కెట్​కు గుజరాత్​, పంజాబ్​, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా గుర్రాలు వచ్చాయి. గుర్రాలను క్రయవిక్రయాలు చేసేందుకు ఔత్సాహికులు పాల్గొన్నారు. మరోవైపు గుర్రాల ధరలు రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు పలుకుతున్నాయి. ఎంతో చరిత్ర ఉన్న ఈ మార్కెట్​ను చూసేందుకు గుర్రాల ప్రేమికులు సైతం పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీనిని యెవలా పట్టణ నిర్మాత రాజే రఘుజి బాబా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మార్కెట్​ను యెవలా వ్యవసాయ మార్కెట్​ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. రఘుజి బాబా హయాంలో ప్రతి మంగళవారం ఈ గుర్రాల మార్కెట్​ జరిగేది. ఆయన అనంతరం వచ్చిన శబురాజే శిందే.. దసరా ముందు వచ్చే మంగళవారం నిర్వహిస్తామని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.