పెళ్లి దుస్తులతో ఓటేసేందుకు వధువు.. అధికారుల సాయంతో అవిభక్త కవలలు

🎬 Watch Now: Feature Video

thumbnail
యూపీ, పంజాబ్​లో పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేయడానికి అన్ని వయసులవారు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఉత్తర్​ప్రదేశ్​ ఫిరోజాబాద్​లో ఓ నవవధువు పెళ్లి బట్టలతో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంది. శనివారం రాత్రి పెళ్లి జరగ్గా.. ఓటు వేసి.. అత్తమామల ఇంటికి బయలుదేరింది ఆమె. పంజాబ్​లో అవిభక్త కవలలు సోహ్నా, మోహ్నాలు కూడా తమ బాధ్యతను మరవలేదు. ఇబ్బంది అనిపించినా.. అధికారులు, స్థానికుల సాయంతో తమ హక్కును వినియోగించుకునేందుకు అమృత్​సర్​ జిల్లా మన్వాల్ ప్రాంతంలోని పోలింగ్ స్టేషన్​కు వచ్చి ఓటు వేశారు. శరీరం ఒకటైనా.. వీరిని ఇద్దరు ఓటర్లుగా పరిగణించారు అధికారులు. ఓటు వేయడాన్ని బాధ్యతగా అనుకొని.. హక్కును వినియోగించుకున్న నవవధువు, అవిభక్త కవలలను అధికారులు అభినందించారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.