భాజపా కార్యకర్త దాడిలో దళిత యువకుడు మృతి- రాముని గుడి ముందే! - dalit youth killed by bjp worker
🎬 Watch Now: Feature Video
రామ్‌మందిర్ ఎదుటే దళిత యువకుడిపై దాడి చేశాడు ఓ భాజపా కార్యకర్త. దీంతో గాయాలకు తట్టుకోలేక మరుసటి రోజే ప్రాణాలు కోల్పోయాడు బాధితుడు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది. ధర్మస్థలి గ్రామానికి చెందిన నిందితుడు కృష్ణ.. భజరంగ్‌దళ్ కార్యకర్త కూడా. ఈ నెల 23న కన్యాడిలోని రామ మందిరం ఎదుట దినేశ్ అనే ఎస్సీ యువకుడిపై ఏదో వివాదం కారణంగా దాడి చేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్థిక స్తోమత లేని కారణంగా దినేశ్‌ను ఆస్పత్రిలో చూపించాలని కృష్ణను కోరింది అతని తల్లి. దీంతో మరుసటి రోజు ఉదయం తన నేరాన్ని కప్పిపుచ్చి, ప్రమాదం జరిగిందని చెప్పి ఆస్పత్రిలో చేరిపించాడు కృష్ణా. అప్పటికే తీవ్ర కడుపు నొప్పితో బాధపడిన దినేశ్.. ఆస్పత్రిలో చేరిన రోజే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనను మాజీ సీఎం సిద్ధరామయ్య ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణను అరెస్టు చేసిన పోలీసులు, బాధిత కుటుంబానికి భద్రత కల్పిస్తామని చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST