కార్చిచ్చు బీభత్సం.. 10వేల ఎకరాలు దగ్ధం - అడవిలో కార్చిచ్చు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12322908-thumbnail-3x2-img.jpg)
అమెరికాలోని పలు ప్రాంతాల్లో దావానంల కల్లోలం సృష్టిస్తోంది. ఒరెగాన్లో కార్చిచ్చు ధాటికి పదివేల ఎకరాల అటవీ భూమి దగ్ధం అయింది. 12 అగ్నిమాపక శకటాలు, 40 మంది సిబ్బందితో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కార్చిచ్చు నేపథ్యంలో ఒరెగాన్ రాష్ట్ర గవర్నర్.. అత్యవసర స్థితిని ప్రకటించారు. మరోవైపు.. ఉత్తర కాలిఫోర్నియాలోనూ దావానలం విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే 27 చదరపు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ఓ అగ్నిపర్వతం బద్ధలవ్వగా ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్నికీలల ధాటికి ఆయా ప్రాంతాల్లోని వన్యప్రాణులు దహనమవుతున్నాయి.