అమెరికాలో కార్చిచ్చు.. మానవ తప్పిదమే కారణం! - ఆరిజోనా
🎬 Watch Now: Feature Video
అమెరికాలోని ఆరిజోనాలో పెద్ద ఎత్తున కార్చిచ్చు ఎగిసిపడింది. దట్టమైన పొగ అలుముకోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంటలను అదుపు చేయడానికి వందకుపైగా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 24కు పైగా నివాసాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. అవసరమైతే మరో 5వేల ఇళ్లనూ ఖాళీ చేయించడానికి సిద్ధంగా ఉన్నారు. మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.