కరోనాతో 'ఫ్యాషన్ షో ఫ్రమ్ హోం' ట్రెండ్ షురూ! - Virtual fashion show to support amfAR Fund to Fight COVID-19
🎬 Watch Now: Feature Video
కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా క్రీడలు, ఇతర పోటీలతో సహా.. యువతను ఎంతగానో అలరించే ఫ్యాషన్‌షోలూ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌పై పోరాటంలో భాగంగా నిధుల సేకరణ కోసం అమెరికా మోడళ్లు ఇంట్లో ఉంటూనే.. ఫ్యాషన్ షో నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ వర్చువల్ కార్యక్రమంలో.. అందాల్ని విరబోస్తూ, తమదైన స్టెప్పులతో చూపరులను మంత్రముగ్దుల్ని చేశారు ఈ ముద్దుగుమ్మలు. షో ముగిసిన అనంతరం అందరూ ఒక్కసారిగా చప్పట్లతో అభినందనలు తెలిపారు.