బిడ్డను ఆడిస్తున్న తల్లికి షాక్.. పట్టపగలే దొంగలు వచ్చి బెదిరించి...

By

Published : Dec 2, 2021, 1:56 PM IST

thumbnail

Mother robbed viral video: అమెరికా లాస్​ ఏంజెల్స్​లో.. ఓ మహిళ భయానక పరిస్థితిని ఎదుర్కొంది. తన ఇంటి ఎదుట.. బిడ్డను ఆడిస్తుండగా ఇద్దరు దుండగులు ఆమె వద్దకు వెళ్లారు. అందులో ఓ దొంగ.. ఆమె దగ్గర ఉన్న బ్యాగు ఇవ్వమని బెదిరించాడు. భయంతో ఆ మహిళ.. డైపర్లు, మంచి నీళ్ల సీసా ఉన్న బ్యాగును ఇచ్చేసింది. ఆ తర్వాత ఆ ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.