అమెరికాలో ఆగని కార్చిచ్చు- వేల ఎకరాలు దగ్ధం - కాలిఫోర్నియాలో ఆగని కార్చిచ్చు
🎬 Watch Now: Feature Video
అమెరికాలోని కాలిఫోర్నియా అటవీ ప్రాంతంలో కార్చిచ్చు విస్తరిస్తూనే ఉంది. సియోర్ర జాతీయ పార్కు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. వేలాది ఎకరాల్లో అటవీ సంపద అగ్నికి ఆహుతి అయ్యింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. సియోర్ర ప్రాంతంలో సుమారు 200 మందిని హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్చిచ్చు వల్ల చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. శాన్ బెర్నార్డినో నగరంలో దట్టమైన పొగల కారణంగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.