TRAI Releases Report On BSNL Call Drop Rate Is High In Hyderabad : హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ కాల్ డ్రాప్‌రేట్ ఎక్కువగా ఉంది. ఇటీవల హైదరాబాద్ నగరంలో నిర్వహించిన ఇండిపెండెంట్ డ్రైమ్ టెస్ట్ (ఐడీటీ)లో వెల్లడి అయిన వివరాలను ట్రాయ్ తాజాగా విడుదల చేసింది. రాజస్థాన్, అహ్మద్‌నగర్, దిల్లీ, హైదరాబాద్‌లో ఐడీటీ అధికారులు సర్వే చేపట్టారు. సెల్యూలార్ మొబైల్ టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు అందిస్తున్న డాటా, వాయిస్ సేవల నాణ్యతను ట్రాయ్ స్వతంత్ర ఏజెన్సీ ద్వారా సర్వే చేయించింది.
డేటా, వాయిస్ సేవలకు సంబంధించి పని తీరును తెలిపే కీలక సూచీలను (కేపీఐ) పరీక్షించింది. హైదరాబాద్ నగరంలో 295 కి.మీ, మెట్రో పరిధిలో 56 కి.మీ. పరిశీలించారు. గత సంవత్సరం అక్టోబరు 22 నుంచి 25 వరకు పరిశీలన చేపట్టారు.
ఫోన్ కాల్స్‌లో : కాల్ డ్రాప్ రేట్ (డీసీఆర్) బీఎస్‌ఎన్‌ఎల్‌లో 3.76 శాతం ఉన్నట్లు ట్రాయ్ నివేదిక వెల్లడించింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం 2 శాతం మించకూడదు. రిలయన్స్ 0.3 శాతం, వొడాఫోన్ ఐడియా సున్నా శాతంగా ఉంది.
కాల్ సెటప్ సక్సెస్ రేట్ (సీఎస్‌ఎస్‌ఆర్) లో రిలయన్స్ 100 శాతం, బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్ 99.85 శాతం, వొడాఫోన్ ఐడియా 98.92 శాతం కలిగి ఉంది.
చౌకైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా?- రూ.200లోపు ధరలో బెస్ట్ ఇవే!
BSNL యూజర్లకు షాకింగ్ న్యూస్!- సంక్రాంతి నుంచి ఆ సర్వీసులు బంద్!