3 Person Raped On Metally Woman in Medak : మనుషుల్లో రోజురోజుకూ మానవత్వం లేకుండా పోతుంది. చిన్న పిల్లలపై అత్యాచారాలు, రోడ్లపై ఉన్న మానసిక సరిగా లేని మహిళలు, దివ్యాంగులనూ వదలట్లేదు కొందరు మానవ మృగాలు. ఇలాంటి వారిపై పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, ఎక్కడో చోట రోజుకో ఘటన జరుగుతూనే ఉంది. తాజాగా మెదక్ జిల్లా రామంతాపూర్‌లో ఓ కేసు కోసం సీసీ ఫుటేజీ చూస్తున్న పోలీసులు ఓ సీన్ చూసి నిర్ఘాంతపోయారు. ముగ్గురు యువకులు ఓ మాససిక దివ్యాంగురాలిని పక్కకు లాక్కెళ్లి అత్యాచారం చేసిన ఘటన చూసి విస్మయం చెందారు.
పోలీసుల వివరాల ప్రకారం : తప్పిపోయిన బర్రె కోసం సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులకు ఓ మానసిక దివ్యాంగురాలిని ముగ్గురు యువకులు రోడ్డు పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన కనిపించడంతో నిర్ఘాంతపోయారు. వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతాపూర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలను చేగుంట ఎస్సై చైతన్య రెడ్డి ఆదివారం వెల్లడించారు.
ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున రామంతాపూర్ వద్ద 44వ జాతీయ రహదారి పక్కన మానసిక స్థితి సరిగా లేని ఓ యువతి (30) నిల్చుని ఉంది. చేగుంటకు చెందిన గౌరి బస్వరాజ్, తూప్రాన్‌కు చెందిన సయ్యద్ అఫ్రోజ్, బిహార్‌కు చెందిన ఎండీ సోహెల్‌లు వ్యానులో కోళ్లను తీసుకెళ్తూ ఆ దివ్యాంగురాలిని చూశారు. ఒంటరిగా ఉండటాన్ని అదనుగా చేసుకొని యువతిని పక్కనే ఉన్న అంబేడ్కర్ విగ్రహం వెనక్కు లాక్కెళ్లి ముగ్గురూ అత్యాచారం చేసి వెళ్లిపోయారు.
ఇలా వెలుగులోకి వచ్చింది : ఈ నెల 10న రామంతాపూర్‌కు చెందిన స్వామి తన బర్రె తప్పిపోవటంతో చేగుంట ఠాణాలో ఫిర్యాదు చేశారు. గాలింపులో భాగంగా పోలీసులు రామంతాపూర్ స్టేజీ వద్ద ఓ హోటల్ సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తుండగా ఈ అత్యాచార ఘటన కనిపించింది. దీంతో ముగ్గురు నిందితులను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బాధిత యువతిని మెదక్ భరోసా కేంద్రానికి తరలించారు.
ఆటోలో అమ్మాయితో అసభ్య ప్రవర్తన - తరువాత ఇంటికొచ్చి ఎత్తుకెళ్లే యత్నం!