ETV Bharat / business

బేసిక్ కార్ నాలెడ్జ్​ - వీటి గురించి తెలిస్తే చాలు - మీ బండి మెయింటెనెన్స్ చాలా​ ఈజీ! - KNOW BASIC THINGS ABOUT YOUR CAR

కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీ బిగినర్స్​ గైడ్ మీ కోసమే!

Know Basic Things About Your Car
Know Basic Things About Your Car (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2025, 9:52 AM IST

Updated : Jan 13, 2025, 10:35 AM IST

Know Basic Things About Your Car : కార్ల విక్రయాలు రెక్కలు తొడిగాయి. మునుపటి కంటే ఇప్పుడు పెద్దసంఖ్యలో కార్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఎగువ మధ్యతరగతి స్థాయికి చేరిన వారంతా ఏ మాత్రం ఆలోచించకుండా ఈఎంఐలపై కార్లను కొనేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్ల నిర్మాణ స్వరూపంపై, అందులోని కీలక భాగాలపై మనకు కనీస అవగాహన ఉండాలి. తద్వారా కార్లను కొనేటప్పుడు, వాటి నిర్వహణ విషయంలో సరైన, సమర్ధమైన నిర్ణయాలను తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకే ఇప్పుడు కారు గురించి బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుందాం.

కారు ఇంజిన్
ఇంజిన్ కారుకు గుండెకాయ లాంటిది. చాలా వరకు కార్లలో కంబష్చన్​ ఇంజిన్లే ఉంటాయి. ఇవి గ్యాసోలిన్ లేదా డీజిల్‌తో నడుస్తాయి. ఈ ఇంజిన్లు తమలోకి చేరే ఇంధనాన్ని మెకానికల్ శక్తిగా మార్చేసి, కారు నడిచేలా చేస్తాయి. ఇంజిన్‌లో సిలిండర్లు, పిస్టన్లు, స్పార్క్ ప్లగ్స్, క్రాంక్ షాఫ్ట్ వంటి కీలకమైన భాగాలు ఉంటాయి. హార్స్ పవర్, టార్క్, ఇంధన సామర్థ్య రేటింగ్స్ వంటి అంశాలపై మనకు అవగాహన ఉంటే కారు పనితీరు, సామర్థ్యాలపై సమగ్ర అంచనాకు రావచ్చు. కారును కొనేటప్పుడు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.

కారు ట్రాన్స్‌మిషన్
కారులో ట్రాన్స్‌మిషన్ అనేది కీలకం. ఇంజిన్ నుంచి వీల్స్‌కు జరిగే శక్తి ప్రవాహం అనేది ట్రాన్స్‌మిషన్ పరిధిలోకి వస్తుంది. చాలావరకు కార్లలో మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలు ఉంటాయి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ఉన్న కార్లలో డ్రైవర్లు క్లచ్ పెడల్ సాయంతో మాన్యువల్‌గా గేర్లను మార్చాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ఉన్న కార్లలో వేగం, ఇంజిన్ ఆర్‌పీఎం ఆధారంగా ఆటోమేటిక్‌గా గేర్లు మారుతాయి.

ఆల్టర్నేటర్స్
కారులోని ఎలక్ట్రికల్ వ్యవస్థలో ఆల్టర్నేటర్ అనేది కీలక భాగం. కారు ఇంజిన్ నడుస్తుండగా, బ్యాటరీ కూడా పనిని మొదలుపెడుతుంది. ఈక్రమంలో ఆల్టర్నేటర్ అనేది ఎలక్ట్రికల్ శక్తిని ఉత్పత్తి చేసి కారులోని వివిధ ఎలక్ట్రికల్ భాగాలకు సరఫరా చేస్తుంది. కారు ఇంజిన్ తనలోకి చేరే ఇంధనాన్ని మెకానికల్ శక్తిగా మారుస్తుంది. ఈ మెకానికల్ శక్తిని ఎలక్ట్రికల్ శక్తిగా మార్చేది ఆల్టర్నేటరే. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా ఈ ప్రక్రియను ఆల్టర్నేటర్ పూర్తి చేస్తుంది.

రేడియేటర్లు
కారులోని కూలింగ్ వ్యవస్థలో కీలకమైన భాగం రేడియేటర్. ఇంజిన్ అతిగా వేడెక్కకుండా ఇది నియంత్రణ, పర్యవేక్షణ చేస్తుంటుంది. ఇంజిన్‌ పనిచేసే క్రమంలో వెలువడే అతివేడిని రేడియేటర్ గ్రహించి, దాన్ని విభజించి విడుదల చేస్తుంటుంది. దీనివల్ల ఇంజిన్‌పై అతివేడి ప్రభావం పడదు. ఇంజిన్‌లో ఏర్పడే అతివేడిని సమీపంలోని గాల్లోకి పంపి, దాన్ని చల్లబరిచేలా రేడియేటర్ నిర్మాణ స్వరూపం ఉంటుంది.

మఫ్లర్
మఫ్లర్‌ను సైలెన్సర్ అని కూడా పిలుస్తారు. కారు నుంచి భారీ ఒత్తిడితో పొగలు బయటకు వెళ్లేటప్పుడు భారీ శబ్దాలు రాకుండా అడ్డుకునేదే సైలెన్సర్ (మఫ్లర్). మఫ్లర్‌ లోపల పెద్దసంఖ్యలో ఛాంబర్లు ఉంటాయి. వాటిలోకి పొగలు ప్రవేశించగానే వాటి వేగం, ఒత్తిడి తగ్గిపోతాయి. ఫలితంగా మఫ్లర్‌ను దాటి బయటికొచ్చే సమయానికి వాటి శబ్దాలు చాలా వరకు తగ్గిపోతాయి.

డ్రైవ్ ట్రైన్
డ్రైవ్ ట్రైన్ అనేది కారు ఏ రకం డ్రైవింగ్ మోడ్‌లో ఉందో నిర్ధారిస్తుంది. కారు ఫ్రంట్ వీల్ డ్రైవ్‌లో ఉందా? రియర్ (వెనుక) వీల్ డ్రైవ్‌లో ఉందా? ఆల్ వీల్ డ్రైవ్‌లో ఉందా? అనేది నిర్ధారించేది డ్రైవ్ ట్రైన్ వ్యవస్థే. ఫ్రంట్ వీల్ డ్రైవ్‌ మోడ్‌లో ఉన్నప్పుడు ఇంజిన్ నుంచి శక్తి ఫ్రంట్ వీల్స్‌కు మాత్రమే అందుతుంది. రియర్​ వీల్ డ్రైవ్ మోడ్‌లో ఉన్నప్పుడు ఇంజిన్ నుంచి శక్తి వెనుక వీల్స్‌కు మాత్రమే అందుతుంది. ఆల్ వీల్ డ్రైవ్ మోడ్‌లో కారు ఉన్నప్పుడు ఇంజిన్ నుంచి శక్తి అన్ని వీల్స్‌కు సుస్థిరంగా, సరిసమానంగా అందుతుంది.

సస్పెన్షన్ వ్యవస్థ
కారులో అత్యంత కీలకమైంది సస్పెన్షన్ వ్యవస్థ. ఇది కారు బరువును మోస్తూ, రోడ్డుపై వాహనం కుదుపులకు గురికాకుండా రక్షణ కల్పిస్తుంది. సస్పెన్షన్ వ్యవస్థలో స్ప్రింగులు, షాక్ అబ్జార్బర్లు, వివిధ లింకేజీలు ఉంటాయి. మంచి సస్పెన్షన్ వ్యవస్థ ఉంటే కారు డ్రైవింగ్ ఆనందదాయకంగా ఉంటుంది. బ్రేకింగ్ కూడా మెరుగ్గా ఉంటుంది.

బ్రేక్స్ వ్యవస్థ
కారు రక్షణలో అత్యంత కీలకమైనవి బ్రేకులు. బ్రేకులను వాడుకొని కారు వేగాన్ని నియంత్రించొచ్చు. ఈతరం అత్యాధునిక వెర్షన్ కార్లలో డిస్క్ బ్రేకులు ఉంటున్నాయి. కారులోని వీల్స్ రొటేషన్‌లో ఉన్న క్రమంలో, వాటి వేగాన్ని నియంత్రణలోకి తెచ్చేందుకు డిస్క్ బ్రేకులు దోహదపడతాయి. కారులోని బ్రేక్ ప్యాడ్స్‌ను నొక్కగానే బ్రేక్ డిస్కులు తమ పనిని మొదలు పెడతాయి. ఫలితంగా వాహనంలోని గతి శక్తి (వేగాన్ని) పొగగా మారి గాల్లోకి చేరుతుంది. ఈ ప్రక్రియ జరిగే క్రమంలో కారు వేగం తగ్గిపోతుంది.

టైర్లు
కారులో ముఖ్యమైన భాగం టైర్లు. కారు భద్రతలో ఇవి కీలకమైనవి. కారు వేగంగా నడవాలన్నా, బ్రేకులు సరిగ్గా పడాలన్నా, టైర్లు సరిగ్గా ఉండాలి. టైర్ల లోపల చాలా లేయర్లు ఉంటాయి. అత్యంత లోపల ఉండే లేయర్ స్టీల్ కోర్డ్స్‌‌తో తయారవుతాయి. టైరు ఆ ఆకారంలో ఉండటానికి కారణం అవే. టైరు పై లేయర్‌లో ట్రెడ్ మెటీరియల్ ఉంటుంది. కారును నడిపేటప్పుడు రోడ్డును తాకేది అదే.

క్లచ్ వ్యవస్థ
కారులో క్లచ్ వ్యవస్థ కీలకమైంది. ఇది బాగుంటే గేర్లను సాఫీగా మార్చగలం. ఇంజిన్ నుంచి వీల్స్‌కు సజావుగా పవర్ సప్లై జరుగుతుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ కలిగిన వాహనాల్లో క్లచ్ వ్యవస్థ ఉంటుంది. క్లచ్ వ్యవస్థలో భాగంగా క్లచ్ పెడల్, క్లచ్ డిస్క్, ప్రెషర్ ప్లేట్, రిలీజ్ బేరింగ్, ఫ్లై వీల్ ఉంటాయి.

ఇంధన ట్యాంకు
కారులోని ఇంధన ట్యాంకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులోనే డీజిల్, గ్యాసోలిన్ వంటివి స్టోర్ అవుతాయి. ఇంధన ట్యాంకు కెపాసిటీ కారును బట్టి మారుతుంటుంది.

బ్యాటరీలు
ప్రతీ కారులో బ్యాటరీలు ఉంటాయి. కారులో విద్యుత్ సప్లై వ్యవస్థకు ఇవే బాధ్యత వహిస్తాయి. కారు ఇంజిన్‌ను స్టార్ట్ చేయడంలో కూడా బ్యాటరీదే కీలక పాత్ర. సాధారణంగా కార్లలో ఆటోమోటివ్ బ్యాటరీలే ఉంటాయి. వాటిని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇవి కెమికల్ ఎనర్జీని తమలో నిల్వ చేసుకొని, వాహనం నడిచినప్పుడు దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తాయి. కార్లలో లెడ్ యాసిడ్ బ్యాటరీలను ఎక్కువగా వాడుతుంటారు.

ఫ్లూయిడ్స్
కార్లలో మనం వివిధ రకాల ఫ్లూయిడ్స్‌ను వాడాల్సి వస్తుంది. వీటిలో ముఖ్యమైనవి ఇంజిన్ ఆయిల్, కూలంట్, బ్రేక్ ఫ్లూయిడ్, ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్. రెగ్యులర్‌గా కారును చెక్ చేసుకొని ఈ ఫ్లూయిడ్స్‌ను మారుస్తుండాలి. కారు పనితీరు, జీవితకాలం మెరుగ్గా ఉండాలంటే ఈ ఫ్లూయిడ్స్ వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

చూశారుగా, వీటన్నింటిపై మీకు ప్రాథమిక అవగాహన ఉండడం చాలా మంచిది. అప్పుడే మీరు మీ బండిని చక్కగా మెయింటైన్ చేయగలుగుతారు.

రూ.7 లక్షల బడ్జెట్లో మంచి మైలేజ్​ ఇచ్చే కారు కొనాలా? టాప్​-5 మోడల్స్ ఇవే!

బైక్‌/ కార్‌ యాక్సెసరీస్‌ షోరూంలో కొనాలా? లేదా మార్కెట్లోనా? ఏది బెస్ట్ ఆప్షన్‌?

Last Updated : Jan 13, 2025, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.