Maha Kumbh Foreign Devotees : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జరుగుతున్న మహా కుంభమేళాకు సోమవారం నాడు భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమి కావడం వల్ల ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించేందుకు భారత్ సహా విదేశాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. చలికాలం కావడం వల్ల గడ్డకట్టే స్థితిలో నీరు ఉన్నప్పటికీ విదేశీ భక్తుల బృందం గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. ఈ క్రమంలో కుంభమేళాలో పాల్గొనడం పట్ల విదేశీ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
#WATCH | Prayagraj, Uttar Pradesh | A group of foreign devotees to take holy dip as #MahaKumbh2025 - the biggest gathering of human beings in the world begins with the 'Shahi Snan' on the auspicious occasion of Paush Purnima, today pic.twitter.com/V71rKvSXgL
— ANI (@ANI) January 12, 2025
ఐ లవ్ ఇండియా
భారత్ చాలా గొప్పదేశమని, మొదటిసారి ఇక్కడ జరిగే కుంభమేళాలో పాల్గొంటున్నానని రష్యాకు చెందిన ఓ భక్తురాలు తెలిపారు. "మేరా భారత్ మహాన్. కుంభమేళాలో మనం అసలైన భారత్ ను చూడవచ్చు. కుంభమేళా జరిగే ప్రదేశంలో శక్తి ఉంది. నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను." అని పేర్కొన్నారు.
#WATCH | Prayagraj | A Russian devotee at #MahaKumbh2025, says, " ...'mera bharat mahaan'... india is a great country. we are here at kumbh mela for the first time. here we can see the real india - the true power lies in the people of india. i am shaking because of the vibe of the… pic.twitter.com/vyXj4m4BRs
— ANI (@ANI) January 13, 2025
'నా హృదయం వెచ్చదనంతో నిండిపోయింది'
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో పాల్గొనడం గొప్ప అనుభూతి అని బ్రెజిల్‌కు చెందిన భక్తుడు ఫ్రాన్సిస్కో తెలిపారు. త్రివేణి సంగమం వద్ద ఉన్న నీరు చల్లగా ఉందని, కానీ స్నానం చేసిన తర్వాత తన హృదయం వెచ్చదనంతో నిండిపోయిందని ఆయన పేర్కొన్నారు. "నేను భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. యోగా సాధన చేస్తూ, మోక్షాన్ని వెతుకుతున్నాను. ప్రయాగ్‌రాజ్ కుంభమేళ అద్భుతంగా ఉంది. భారత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక హృదయం" అని ఫ్రాన్సిస్కో అభిప్రాయపడ్డారు.
#WATCH | Prayagraj | A Brazilian devotee at #MahaKumbh2025, Fransisco says, " i practice yoga and i am searching for moksha. it's amazing here, india is the spiritual heart of the world... water is cold but the heart is filled with warmth." pic.twitter.com/as1oBQXmGl
— ANI (@ANI) January 12, 2025
'అదృష్టంగా భావిస్తున్నా'
త్రివేణి సంగమంలో స్నానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని స్పెయిన్‌కు చెందిన ఓ భక్తుడు ఆనందం వ్యక్తం చేశారు. స్పెయిన్, బ్రెజిల్, పోర్చుగల్‌కు చెందిన చాలా మంది స్నేహితులం కలిసి ఆధ్యాత్మిక యాత్రకు భారత్ వచ్చామని తెలిపారు.
#WATCH | Prayagraj | A Spanish devotee at #MahaKumbh2025, Jose says, " we are many friends here - from spain, brazil, portugal... we are on a spiritual trip. i took holy dip and i enjoyed it much, i am very lucky." pic.twitter.com/YUD1dfBgM4
— ANI (@ANI) January 12, 2025
ఆనందం వ్యక్తం చేసిన ప్రవాస భారతీయుడు
జర్మనీలో స్థిరపడ్డ ప్రవాస భారతీయుడు జితేశ్ ప్రభాకర్ తన కుటుంబంతో కలిసి త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. ఈ క్రమంలో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. " నేను భారత్ నివసిస్తున్నానా? లేదా విదేశాలలో నివసిస్తున్నానా? అనేది ముఖ్యం కాదు. దేశంతో సంబంధం ఉండాలి. నేను ప్రతిరోజూ యోగా సాధన చేస్తాను. నేను ఎల్లప్పుడూ భారత్ రావడానికి ఇష్టపడతాను" అని జితేశ్ ప్రభాకర్ పేర్కొన్నారు.
#WATCH | Prayagraj | Jitesh Prabhakar, originally from Mysore and now a German citizen along with his wife Saskia Knauf and a baby boy, Aditya arrive at #MahaKumbh2025
— ANI (@ANI) January 13, 2025
Jitesh says, " ...it doesn't matter if i live here (in india) or abroad - the connection should be there. i… pic.twitter.com/vPhpoJNvh1
'ఇక్కడ ప్రజలు చాలా ఫ్రైండ్లీ'
ప్రయాగ్‌రాజ్ వీధులు చాలా శుభ్రంగా ఉన్నాయని, ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ భక్తుడు అన్నారు. తాను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే, త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని మరో భక్తురాలు సంతోషం వ్యక్తం చేసింది.
#WATCH | Prayagraj | A devotee from South Africa's Cape Town at #MahaKumbh2025, says, " it's so beautiful. the streets are clean, the people are so friendly and happy... we practice sanatan dharm..." pic.twitter.com/Q5PUnSriuy
— ANI (@ANI) January 13, 2025
#WATCH | Prayagraj | A devotee from South Africa's Cape Town at #MahaKumbh2025, Nikki says, " it's very very powerful and we are very blessed to be here at river ganga..." pic.twitter.com/Zv9d8OkQjV
— ANI (@ANI) January 13, 2025
భక్తుల భద్రతకు ఏర్పాట్లు
కుంభమేళాకు వచ్చే భక్తుల భద్రత కోసం రాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బృందాలు కూడా సంఘటనా స్థలంలో పహారా కాస్తున్నాయి. అలాగే భక్తులకు వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.
హెలికాప్టర్ రైడ్
భక్తుల కోసం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చాలా చౌకగా హెలికాప్టర్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ఛార్జీ రూ.1,296. దీనివల్ల మహా కుంభ మేళా, ప్రయాగ్‌రాజ్ నగరాన్ని గగనతలం నుంచి తిలకించే అవకాశం లభిస్తుంది. ఇది వరకు ఈ హెలికాప్టర్ ఛార్జీ రూ.3,000 ఉండేది. హెలికాప్టర్‌లో పర్యటించాలనుకునే వాళ్లు ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ www.upstdc.co.in టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్ ప్రదేశ్ పర్యటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు.
అలాగే జల, సాహస క్రీడలపై ఆసక్తి ఉన్న పర్యటకుల కోసం ఉత్తర్‌ప్రదేశ్ పర్యటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ జనవరి 24- 26 వరకు డ్రోన్ షో, వాటర్ లేజర్ షో వంటివి నిర్వహించనుంది. అలాగే గంగా పండల్ లో జనవరి 16న బాలీవుడ్ గాయకుడు శంకర్ మహదేవన్ సంగీత ప్రదర్శన ఉంటుందని తెలిపింది.
45 రోజులపాటు జరగనున్న కుంభమేళా
ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న (సోమవారం) ప్రారంభమైన మహా కుంభమేళా 45రోజులపాటు జరగనుంది. 12 ఏళ్లకోసారి జరిగే ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది భక్తులు హాజరుకానున్నారు.