Killed to his Friend For RS.300 in Janagama District : రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావంటే 'హరిశ్చంద్రుడి చేత అబద్ధమాడిస్తాను. భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను. తండ్రీబిడ్డలను విడదీస్తాను. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను. ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను' అని ఓ సినిమాలో డైలాగ్. అంత పాపిష్ఠిది డబ్బు. అటువంటి డబ్బును కష్టపడి సంపాదిస్తే ఎంతో హాయిగా ఉంటుంది. అక్రమదారుల్లో సంపాదించాలని చూస్తే అది ఎప్పటికైనా నష్టమే. ఆ డబ్బు కోసం ప్రాణాలైనా పోతాయి, లేదా ఎదుటి వారి ప్రాణాలైనా తీయాల్సి వస్తుంది. అలాంటి ఘటనే జనగామ జిల్లాలో చోటు చేసుకుంది.
రూ.300 కోసం హత్య : డబ్బులు ఇవ్వలేదని ఓ యాచకుడిని ముగ్గురు స్నేహితులు హత్య చేశారు. ఈ ఘటన జనగామలో ఆదివారం వెలుగు చూసింది. జనగామ పట్టణ ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం, మహబూబాబాద్‌కు చెందిన వెంకన్న (30) 15 సంవత్సరాలుగా జనగామ రైల్వే స్టేషన్ ప్రాంతంలో కోతులను ఆడిస్తూ భిక్షాటన చేస్తున్నాడు. దీంతో వచ్చిన డబ్బుతోనే జీవనం సాగిస్తున్నాడు. ఆయన శనివారం రాత్రి తన ముగ్గురు మిత్రులతో కలిసి స్థానిక వినాయక బార్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశానికి వెళ్లాడు. స్నేహితులు రూ.300 ఇవ్వాలని వెంకన్నను అడిగారు. తన వద్ద డబ్బులు లేవని వెంకన్న చెప్పాడు. దీంతో నలుగురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వెంకన్న తలపై బండరాయితో మోదారు. దీంతో వెంకన్న మృతి చెందాడు. మృతదేహానికి నిప్పంటించి దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
విచారణ చేస్తున్నట్లు సమాచారం : స్థానిక ప్రజలు ఆదివారం వెంకన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ చేతన్ నితిన్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి స్నేహితుడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పోయిన బర్రె కోసం వెతుకుతుంటే - ఎవరూ చూడని మానవ మృగాలు బయటపడ్డాయి
20 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి - నచ్చక 2 నెలల క్రితం కోడలి హత్య
లివ్-ఇన్ పార్టనర్ హత్య! 10 నెలలుగా ఫ్రిడ్జ్‌లో మహిళ మృతదేహం- ఇలా వెలుగులోకి!