ETV Bharat / state

ఈసారి భోగి ఎంతో ప్రత్యేకం - 110 ఏళ్లకు ఒకసారి ఇలా! - మంటల్లో ఇవి దహనం చేసేద్దాం! - SPECIAL STORY ON BHOGI FESTIVAL

సంక్రాంతి శోభను సంతరించుకున్న తెలుగు రాష్ట్రాలు - భోగి మంటల్లో చెడు వ్యసనాలను దహనం చేయాలని పిలుపు

Special Story on Bhogi Festival 2025
Special Story on Bhogi Festival 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2025, 9:11 AM IST

Special Story on Bhogi Festival 2025 : పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రజలందరూ 3 రోజుల పాటు ఉత్సాహంగా జరుపుకొనే పండుగ సంక్రాంతి. రాష్ట్రంలోని ప్రతి లోగిలి ఇప్పటికే రంగుల క్రాంతిని సంతరించుకుంది. సోమవారం భోగి పండుగతో అసలు పర్వదినం ప్రారంభం అయింది. సూర్యుడు దక్షిణాయంలో ఉండే చివరి రోజుగా భోగిని చెప్పుకొంటారు. ఈ సంవత్సరం భోగికి మరో విశిష్టత సైతం ఉంది.

సోమవారం, పుష్య మాసం, పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం కలిసి రావడంతో ఈ రోజుని శివ ముక్కోటిగా పండితులు చెప్పుకుంటున్నారు. 110 సంవత్సరాలకు ఒకసారి ఈ అద్భుత కలయిక వస్తుందని అంటున్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ భోగి నాడు ఆవు పేడతో చేసిన పిడకలు, నెయ్యితో పాటు ఇంట్లోని పాత కలప వస్తువులతో వేసే భోగి మంటల్లో మనలోని దుర్గుణాలు సైతం వేసి ఈ సంక్రాంతి పండుగ నుంచి మనలో ప్రగతి క్రాంతి వెల్లివిరియాలని కోరుకుందాం.

చెడు వ్యసనాలను దహనం చేద్దాం : ప్రస్తుతం యువతను పెడదోవ పట్టిస్తున్న జాఢ్యాల్లో ధూమపానం, మద్యం, మత్తు పదార్థాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ సంవత్సరం భోగి మంటల్లో మనలోని చెడు వ్యసనాలను అన్నింటినీ వేసి దహనం చేయాలి.

ఫోన్​కు కేటాయించే టైం కొంత మేర తగ్గిద్దాం : ప్రస్తుతం సమాజంలో ప్రజలను పట్టి పీడిస్తున్న మరో జాఢ్యం సెల్​ఫోన్. ప్రజలందరూ రోజులో ఎక్కువ టైం సెల్​ఫోన్​తోనే గడుపుతున్నారు. పిల్లలు, కుటుంబం, భవిష్యత్తును దూరం చేసుకుంటున్నారు. కొందరికి మొబైల్ అవసరమే కానీ, దీన్ని వినియోగించే టైం చాలా వరకు తగ్గించాల్సిన అవసరం ఉంది. సెల్​ఫోన్​ను కొన్ని నెలలు దూరం పెట్టిన కొందరు యువకులు ఇటీవల ప్రభుత్వ కొలువుల్లో సత్తా చాటారు. ఈ భోగి మంటల్లో సెల్​ ఫోన్​కు కేటాయించే టైం కొంత మేర వదిలేసి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం.

ప్రతి ఒక్కరం మొక్కలను నాటుదాం : పర్యావరణానికి హాని తలపెడుతున్న ప్లాస్టిక్‌ భూతం చాలా వేగంగా విస్తరిస్తుంది. ఇలా నిత్యం టన్నుకు పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగు అవుతున్నాయి. ఈ భోగి మంటల్లో ప్లాస్టిక్‌ భూతాన్ని దహనం చేసి, పర్యావరణ పరిరక్షణకు మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. మరోవైపు పరిశ్రమల స్థాపన, అభివృద్ధి, రోడ్ల విస్తరణ పేరుతో నరికేస్తున్న చెట్ల స్థానంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ఈ సంక్రాంతి నుంచే శ్రీకారం చుడదాం.

నిత్యం ఉదయాన్నే వ్యాయామం చేద్దాం : ప్రస్తుత రోజుల్లో చాలా మంది కాలు కదపకుండా బద్దకానికి బద్దులైపోయారు. దీంతో అనేక మంది మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి బాధపడుతున్నారు. ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు వివరిస్తున్నారు. ప్రజలు తమ బద్దకాన్ని ఈ భోగి మంటల్లో విడిచిపెట్టి, నిత్యం ఉదయాన్నే వ్యాయామం చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు జీవితాన్ని ఉత్సాహంగా గడపాలని ఆశిద్దాం.

సంక్రాంతి స్పెషల్ : ఆంధ్ర అల్లుడికి 130 రకాల 'హైదరాబాద్' వంటకాలు

సంక్రాంతి నాడు ఈ ముగ్గులు వేస్తే మీ ఇంటి లుక్కే మారిపోతుంది - నచ్చితే ఓ సారి ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.