మంచు తుపానుతో భారీగా ట్రాఫిక్‌జాం
🎬 Watch Now: Feature Video
అమెరికాను కొద్దిరోజులుగా మంచుతుపాను భయపెడుతోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. దక్షిణ కాలిఫోర్నియాలోనూ శుక్రవారం.. ప్రధాన రహదారుల వెంట ట్రాఫిక్ స్తంభించింది. లాస్ ఏంజలెస్, యాంటెలోప్ వ్యాలీని కలిపే స్టేట్ రూట్ 14పై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. క్రిస్మస్ రోజు భారీగా మంచు కురవడంతో ప్రధాన రహదారిని మూసివేశారు. అనంతరం మళ్లీ రాకపోకలకు అధికారులు అనుమతి ఇచ్చారు. అన్ని మార్గాల నుంచి నేరుగా ప్రధాన రహదారి మీదకు చేరుకున్న వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాయి.