Kabul Airport: తాలిబన్ల వశమయ్యాక కాబుల్ ఎయిర్పోర్ట్ ఇలా... - international news in telugu
🎬 Watch Now: Feature Video
మొన్నటివరకు వేల మంది జనం, భారీ సైన్యం, తుపాకుల మోత, బాంబు పేలుళ్లతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఉన్న కాబుల్ విమానాశ్రయంలో (Kabul Airport) ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొంది. అమెరికా దళాలు చిట్ట చివరి విమానం వెళ్లిపోయాక ఎయిర్‌పోర్టును పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు తాలిబన్లు(Afghan Taliban). రన్‌వేపై వాహనాలతో హల్చల్ చేశారు. 20 ఏళ్ల తమ కల నెరవేరిందని ఆనందంలో మునిగి తేలుతున్నారు. కొద్ది రోజుల తర్వాత ఈ మిమానాశ్రయంలో సాధారణ సేవలు ఉంటాయని చెబుతున్నారు.