షార్జాలోని ఆబ్కో టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం - Fires erupts in UAE
🎬 Watch Now: Feature Video
యూఏఈ షార్జాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అల్‌నహ్‌డా ప్రాంతంలోని 48అంతస్తుల అబ్కో టవర్‌లో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. పదో అంతస్తులో చెలరేగిన మంటలు.. బిల్డింగ్‌లోని ఇతర అంతస్తులకు వ్యాపించాయి. భయాందోళనకు గురైన నివాసితులు భవనం నుంచి బయటకు పరుగులు తీశారు. సుమారు 3 గంటలపాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలైనట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు.