ఎటుచూసినా మంటలే.. కాలిఫోర్నియాలో కార్చిచ్చు - latest update on California
🎬 Watch Now: Feature Video
కాలిఫోర్నియాలో..కార్చిచ్చు చెలరేగింది. వైన్, రివర్ సైడ్ కౌంటిచ, శాన్ ఫ్రాన్సిస్కోలో విస్తరించిన కార్చిచ్చుతో వందల ఇళ్లు కాలి బూడిదయ్యాయి. కిలోమీటర్ల మేర దట్టమైన పొగ కమ్మేయటం వల్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపేశారు అధికారులు. ఇప్పటికే దాదాపు 2 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హెలికాప్టర్ల సాయంతో.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.