స్పెయిన్లో అదిరే డ్రోన్ల ప్రదర్శన.. ఎందుకంటే? - కరోనా బాధితులు
🎬 Watch Now: Feature Video

కరోనాపై పోరాడుతున్న ప్రజల్లో స్ఫూర్తిని నింపే దిశగా... స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరంలో డ్రోన్ల ప్రదర్శన ఆకట్టుకుంది. వైరస్ సోకిన వారిలో ధైర్యం నూరిపోసేలా, అత్యవసర సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులకు కృతజ్ఞత తెలిపేలా ఈ ప్రదర్శన నిర్వహించారు. రంగురంగుల ఎల్‌ఈడీ దీపాలు అమర్చిన డ్రోన్లు వివిధ రకాల ఆకృతుల్లో కనిపించేలా 10 నిమిషాలు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన అందరినీ కట్టిపడేసింది. మొత్తం 40 డ్రోన్లతో స్పెయిన్‌కు చెందిన యుమిలెస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్, మాడ్రిడ్ సిటీ హాల్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాయి.