నూతన ఏడాదికి న్యూయార్క్ ప్రజల ఘన స్వాగతం - నూతన ఏడాదికి న్యూయార్క్ ప్రజల ఘన స్వాగతం
🎬 Watch Now: Feature Video
అమెరికా న్యూయార్క్‌లోని టైమ్స్వ్కేర్లో కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికారు ప్రజలు. టపాసుల మోత, కళ్లు జిగేలుమనిపించే విద్యుత్ దీప కాంతుల మధ్య ఆ ప్రాంతమంతా మరో అద్భుత లోకంగా కనిపించింది. సుమారు 1,360 కిలోల రంగుల కాగితాలను వెదజల్లారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరై.. నృత్యాలు చేస్తూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ వేడుకలకు రాప్-పాప్ స్టార్ పోస్ట్ మలోన్, కే-పాప్ గ్రూప్ బీటీఎస్, గాయకుడు సామ్ హంట్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.