సూసైడ్‌కు సిద్ధపడ్డ రైటర్ కోన వెంకట్.. ఆ అమ్మాయిని చూసి.. - సుమ అడ్డా టాక్ షో ముఖ్య అతిధులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-17855836-thumbnail-4x3-wwwww.jpg)
టాలీవుడ్లో ఉన్న ప్రముఖ రైటర్స్‌లో కోన వెంకట్ ఒకరు. గీతాంజలి, నిన్ను కోరి, జై లవకుశ వంటి అనేక సూపర్‌హిట్ చిత్రాలకు ఆయన రైటర్‌గా పనిచేశారు. తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న సెలబ్రిటీ టాక్ షో సుమ అడ్డాకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రతి శనివారం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ఈ షోకు పులి మేక చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పాటు కోన వెంకట్ విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా కోన వెంకట్ తన జీవితంలో మర్చిపోలేని సంఘటనను పంచుకున్నారు. తాను ఒకానొక సమయంలో ఆత్మహత్యకు సిద్ధపడినట్లు తెలిపారు. అప్పుడు చేతి నిండా నిద్రమాత్రలను తీసుకుని సూసైడ్ చేసుకునేందుకు సిద్ధమయ్యానని, కానీ ఓ అమ్మాయిని చూసి ఆ మాత్రలన్నీ కింద పడేశానని చెప్పారు. అసలు అప్పుడు ఏం జరిగింది? ఆ అమ్మాయి ఎవరో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.