అశ్రునయనాల మధ్య ఇందిరాదేవి అంత్యక్రియలు.. తరలివచ్చిన అభిమానులు, ప్రముఖులు - ఇందిరాదేవి భౌతికకాయానికి ప్రముఖుల నివాళి
🎬 Watch Now: Feature Video
సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి అంత్యక్రియలు ముగిశాయి. పద్మాలయ స్టూడియో నుంచి జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో మహేశ్.. తల్లి పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. ఇందిరాదేవి పార్థివ దేహాన్ని చివరిసారిగా చూస్తూ కృష్ణ, మహేశ్ కన్నీంటి పర్యంతమయ్యారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST