Airtel Network Down Today: టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సేవలకు నేడు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో వేలాదిమంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఎయిర్‌టెల్ సేవల్లో అంతరాయం ఏర్పడిందని 2,800కి పైగా నివేదికలను Downdetector.in చూపించింది.
Airtel Broadband & Mobile Services All Are Down ,
— Jiten Kumar (@jitenpalkumar) December 26, 2024
No Network on Mobile & Boradband 😐😐😐😐
Everything is gone in Gujarat Right Now..!@airtelindia @Airtel_Presence @airtelnews #mobilenetwork #airtel #airtel5gsmartconnect #nowifi
దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన ఎయిర్‌టెల్ నేడు నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొంటోంది. నెట్‌వర్క్ డౌన్ కారణంగా గందరగోళం నెలకొంది. దీంతో వేలాది మంది ఎయిర్‌టెల్ వినియోగదారులు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాల్స్ చేయలేకపోతున్నామని, ఇంటర్నెట్ యాక్సెస్ పొందలేకపోతున్నామని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' వేదికగా ఫిర్యాదు చేశారు. మరికొంతమంది ఎయిర్‌టెల్ సిమ్‌లో నడుస్తున్న వారి డివైజ్ చాలా కాలంగా 'నో నెట్‌వర్క్' అని చూపిస్తుందని అసహనాన్ని వ్యక్తం చేశారు.
డౌన్‌డెటెక్టర్ సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా 2,800 మందికి పైగా ఎయిర్‌టెల్ వినియోగదారులు నెట్‌వర్క్ ఔటేజ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. వీరిలో 47శాతం మంది వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్ పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. అయితే 30 శాతం మంది మాత్రం మొత్తం బ్లాక్‌అవుట్‌ని నివేదించారు. 23శాతం మంది వినియోగదారులు మొబైల్ సిగ్నల్ గురించి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X'లో చేసిన పోస్ట్‌ల ప్రకారం.. ఎయిర్‌టెల్ అంతరాయం గుజరాత్‌లోని వినియోగదారులను ఎక్కువగా ప్రభావితం చేసింది.
అహ్మదాబాద్‌లో యూజర్లు కూడా పెద్ద ఎత్తున ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఓ వినియోగదారుడు 'X' లో చేసిన పోస్ట్‌లో తనతో పాటు ఎవరైనా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నారా అని అడిగారు. దీనిపై స్పందించిన కొంతమంది ఎయిర్‌టెల్ కస్టమర్లు తమకు కూడా నెట్‌వర్క్ లభించడం లేదని కామెంట్లు పెట్టారు. మరో వినియోగదారుడు ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ సేవలు డౌన్‌లో ఉన్నాయని, తన డివైజ్‌లలో నెట్‌వర్క్ లేదని బదులిచ్చారు. అయితే దీనిపై ఎయిర్‌టెల్ మాత్రం ఇంతవరకూ స్పందిచలేదు. నెట్‌వర్క్ డౌన్ సమస్యకు గల కారణాలపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
మంచి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలా?- కిర్రాక్ ఫీచర్లతో 2024లో టాప్ ఇవే!
50MP కెమెరా, 5500mAh బ్యాటరీ.. వివో కొత్త 5G ఫోన్ ఏముంది భయ్యా.. రూ. 12,999లకే!