Murali Mohan On Benefit shows And Ticket Rates Hike : టికెట్ ధరలు పెంపు, అదనపు షోలు లేకపోతే బెస్ట్ మూవీస్ తీయటం కష్టమేనని నిర్మాత, నటుడు మురళీ మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ ప్రముఖుల భేటీ జరిగిన నేపథ్యంలో ఈటీవీ- ఈటీవీ భారత్‌తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.‘ప్రపంచ స్థాయి సినిమాలు తీయాలంటే వ్యయం తప్పడం లేదని మురళీ మోహన్ అన్నారు. చిత్రం విడుదలైన వారం రోజుల వ్యవధిలోనే ఖర్చును రాబట్టుకోవాల్సి ఉంటుందన్నారు.
అదనపు షోలు వేయలేకపోతే నిర్మాత ఖర్చు పెట్టలేడు : అదనపు షోలు వేయడం ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ ఉందని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. అదనపు షోలు వేయలేకపోతే నిర్మాత ఖర్చు పెట్టలేడని వివరించారు. చిత్ర పరిశ్రమ సమస్యలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా తమ విన్నపాలను ఆలకించారని మురళీ మోహన్ వివరించారు.
ఫస్ట్ షోకు చిత్ర యూనిట్ వెళ్లకపోతే సినిమాను అంచనా వేయలేమని మురళీ మోహన్ తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. అందుకు చింతిస్తున్నామని మురళీ మోహన్ వివరించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ సర్కారు దగ్గరకు టాలీవుడ్ బృందం వెళ్తుందని వెల్లడించారు. నంది అవార్డుల అంశంపై పవన్ కల్యాణ్‌తో మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు సూచించినట్లుగా మురళీ మోహన్ వివరించారు. కళాకారుడికి ప్రభుత్వ గుర్తింపు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. కళాకారుడికి డబ్బు కన్నా గుర్తింపే ముఖ్యమని మురళీ మోహన్ పేర్కొన్నారు.
"ప్రపంచస్థాయి సినిమా తీయాలంటే భారీ ఖర్చు తప్పదు. సినిమా విడుదలైన వారంలోనే ఖర్చును రాబట్టుకోవాలి. అదనపు షోలు వేయడం అన్ని చిత్ర పరిశ్రమల్లో ఉంది. బెనిఫిట్ షోలు లేకపోతే నిర్మాత ఖర్చు పెట్టలేడు. చిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. సీఎం రేవంత్‌రెడ్డి చాలా సానుకూలంగా మా విన్నపాలను ఆలకించారు"- మురళీ మోహన్, నటుడు
ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు - సినీ ప్రముఖులకు తేల్చి చెప్పిన సీఎం
ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు - టికెట్ రేట్లు పెంపునకు అనుమతి ఉండదు! : మంత్రి కోమటిరెడ్డి