ETV Bharat / sports

రీవైండ్​ 2024 : పారిస్‌ ఒలింపిక్స్​లో భారత్‌ రికార్డులు- త్రుటిలో చేజారిన పతకాలు - INDIA AT PARIS OLYMPICS 2024

ఈ ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్ అదరగొట్టిన భారత అథ్లెట్లు వీరే!

India At Paris Olympics 2024
India At Paris Olympics 2024 (Source: ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 26, 2024, 10:00 PM IST

India At Paris Olympics 2024 : ఈ ఏడాది జరిగిన పారిస్‌ ఒలింపిక్స్​లో భారత అథ్లెట్ల పోరాటం యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఈ సారి విశ్వక్రీడల్లో భారత్‌ తరఫున 16 క్రీడాంశాల్లో 117 మంది పోటీపడ్డారు. పారిస్ ఒలింపిక్స్​లో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకాలు భారత్ కు దక్కాయి. పతకాల సంఖ్య తక్కువగానే ఉన్న ఈ ఒలింపిక్స్‌ లో మనోళ్లు పలు కొత్త రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో 2024లో పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటిన అథ్లెట్లు, వారు నెలకొల్పిన రికార్డులపై ఓ లుక్కేద్దాం పదండి.

అథ్లెటిక్స్​లో ఒక్కడే
టోక్యో ఒలింపిక్స్‌ 2020లో స్వర్ణం సాధించిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా పారిస్​లో రజత పతకం దక్కించుకున్నాడు. దీంతో ఒలింపిక్స్​లో అథ్లెటిక్స్‌ విభాగంలో వరుసగా రెండు పతకాలు సాధించిన రెండో భారతీయుడిగా నీరజ్‌ రికార్డు సృష్టించాడు. కాగా, పారిస్ ఒలింపిక్స్​లో 89.45 మీటర్ల దూరం బల్లేన్ని విసిరాడు నీరజ్. కానీ అనూహ్యంగా పాకిస్థాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్​ను(92.97 మీటర్లు) మాత్రం దాటలేకపోయాడు. దీంతో స్వర్ణాన్ని అర్షద్​ ఎగరేసుకుపోగా, నీరజ్‌ రజతంతో సరిపెట్టుకున్నాడు.

చరిత్ర సృష్టించిన మను బాకర్‌
పారిస్ ఒలింపిక్స్‌ లో షూటింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్​లో మను బాకర్‌ కాంస్య పతకం దక్కించుకుంది. దీంతో విశ్వక్రీడల్లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్​గా రికార్డు సృష్టించింది. మిక్స్​డ్ టీమ్‌ ఈవెంట్​లోనూ సరబ్‌ జ్యోత్​తో కలిసి కాంస్యం సాధించిన మను స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్​లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్​గా నిలిచింది. అలాగే మహిళల 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్​లో నాలుగో స్థానంలో నిలిచిన మను బాకర్ త్రుటిలో కాంస్యాన్ని చేజార్చుకుంది.

అత్యధికంగా ఒకే విభాగంలో మూడు పతకాలు
షూటర్‌ స్వప్నిల్ కుశాలె 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్​లో కాంస్య పతకం అందుకున్నాడు. భారత్‌ ఒక ఒలింపిక్స్‌లో ఒకే క్రీడాంశంలో మూడు పతకాలు అందుకోవడం కూడా మొదటిసారి కావడం విశేషం. ఇదే షూటింగ్ విభాగంలో మనుబాకర్ రెండు పతకాలు గెలుచుకుంది.

52 ఏళ్ల తర్వాత
పారిస్ ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలుచుకుంది. దీంతో విశ్వక్రీడల్లో హాకీలో భారత్ పతకాల సంఖ్య 13కి చేరింది. భారత జట్టు 52 ఏళ్ల తర్వాత హాకీలో వరుసగా కాంస్య పతకాలు సాధించడం ఇదే తొలిసారి. అంతకు ముందు 1968, 1972లో టీమ్​ఇండియా మూడో స్థానంలో నిలిచింది.

పిన్న వయస్కుడిగా అమన్
పారిస్ ఒలింపిక్స్​లో పురుషుల విభాగంలో పోటీ పడిన ఏకైక రెజ్లర్‌ అమన్ సెహ్రావత్. తిరుగులేని ఆటతో ఆశలు రేపినా అతడు సెమీస్​లో భంగపడ్డాడు. చివరకు కాంస్య పతకం సాధించి రెజ్లింగ్‌ లో ఈ సారి భారత్‌ కు పతకాన్ని అందించాడు.

వినేశ్ ఫొగాట్​పై అనర్హత వేటు
రెజ్లింగ్‌ లో వినేశ్ ఫొగాట్‌ ఫైనల్‌ కు చేరడంతో పతకం వస్తుందని యావత్ భారతావని సంబరపడింది. కానీ, 100 గ్రాముల బరువు ఎక్కువన్న కారణంగా స్వర్ణ పతక పోరుకు ముందు వినేశ్‌ అనర్హతకు గురైంది. ఈ వార్త యావత్‌ భారతావనిని తీవ్ర నిరాశకు గురి చేసింది.

పారిస్ ఒలింపిక్స్ ఆకట్టుకున్న ప్రదర్శనలు
ఆర్చరీ : ఆర్చరీలో మిక్స్​డ్‌ టీమ్‌ ఈవెంట్​లో బొమ్మదేవర ధీరజ్‌, అంకిత నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. దీంతో త్రుటిలో కాంస్యాన్ని కోల్పోయారు.

బ్యాడ్మింటన్ : పారిస్‌ ఒలింపిక్స్​లో స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ కొద్దిలో కాంస్యాన్ని మిస్‌ చేసుకున్నాడు. పురుషుల విభాగంలో సెమీస్‌ చేరిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించిన అతడు, అక్కడ విక్టర్‌ అక్సెల్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడాడు. కాంస్య పతక పోరులో చివరి వరకూ పోరాడి మలేషియా ఆటగాడు లీ జి జియా చేతిలో పరాజయం చవిచూశాడు.

టేబుల్ టెన్నిస్ : మనిక బాత్రా, శ్రీజ అకుల ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌ కు చేరుకున్న తొలి భారత ప్లేయర్లుగా నిలిచారు. ఆ తర్వాత మ్యాచ్ లో ఓటమిపాలయ్యారు.

2024 రౌండప్ : ఈ ఏడాది క్రికెట్​కు గుడ్​బై చెప్పిన ఫారిన్ ప్లేయర్లు

టీ20 వరల్డ్‌ కప్‌ టు టెస్ట్‌ క్లీన్‌ స్వీప్‌! - 2024లో భారత క్రికెట్‌లో జరిగిన కీలక అంశాలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.