ETV Bharat / sports

బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ శుభారంభం- భారత్​లో మళ్లీ బుమ్రానే! - IND VS AUS 4TH TEST

భారత్ x ఆస్ట్రేలియా : నాలుగో టెస్టులో తొలి రోజు కంప్లీట్- రాణించిన టాపార్డర్

IND VS AUS 4th Test
IND VS AUS 4th Test (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 12 hours ago

Updated : 12 hours ago

Ind vs Aus 4th Test 2024 : బాక్సింగ్‌ డే టెస్టులో ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కింది. టాపార్డర్ బ్యాటర్లు చెలరేగారు. టాప్‌ - 4 బ్యాటర్లు హాఫ్‌ సెంచరీలు సాధించారు. తొలి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టీవ్ స్మిత్ (68 పరుగులు), ప్యాట్ కమిన్స్ (8 పరుగులు) ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో రాణించాడు. ఆకాశ్‌ దీప్, సుందర్, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఆసీస్ దూకుడు
టాస్ నెగ్గిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి నుంచే దూకుడుగా ఆడింది. ఓపెరన్లు సామ్‌ కాన్‌స్టాస్‌ (60 పరుగులు), ఉస్మాన్ ఖవాజా (57 పరుగులు) తొలి వికెట్​కు 89 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబూషేన్ (72 పరుగులు), స్టీవ్ స్మిత్ (68 పరుగులు) కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలోనే తొలి మూడు వికెట్లకు వరుసగా 50+ భాగస్వామ్యాలు నమోదయ్యాయి.

మళ్లీ బుమ్రానే
ఆసీస్​ టాపార్డర్ నిలకడగా ఆడుతుండడం వల్ల భారత్​కు డీలా పడింది. తొలుత ప్రభావం చూపని బుమ్రా, క్రమంగా టచ్​లోకి వచ్చాడు. 44.1 ఓవర్ వద్ద ఖవాజాను ఔట్ చేసి తొలి వికెట్ దక్కించుకున్నాడు. ఇక ప్రమాదకరమైన ట్రావిస్ హెడ్​ (0)ను బుమ్రా చక్కని ఇన్​స్వింగర్​తో క్లీన్​ బౌల్డ్ చేశాడు. అక్కడే భారత్​ మళ్లీ గేమ్​లోకి వచ్చింది. లేదంటే హెడ్ మరోసారి భారీ స్కోర్ చేసేవాడేమో! ఆ తర్వాత మిచెల్ మార్ష్ (4) ను కూడా పెవిలియన్ చేర్చి భారత్​కు బుమ్రా మళ్లీ బ్రేక్ ఇచ్చాడు.

తొలి రోజు ఆటలో మరికొన్ని విశేషాలు

  • ఈ సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఆసీస్ బ్యాటర్ ఖవాజాను బుమ్రానే ఐదు సార్లు ఔట్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో ఖవాజా 87 బంతులు ఎదుర్కొని 24 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, ఈ సిరీస్‌లో తొలిసారి హాఫ్‌ సెంచరీ ఇదే కావడం గమనార్హం.
  • 2017లో పాకిస్థాన్‌తో టెస్టులో తొలి మూడు వికెట్లకు 50+ భాగస్వామ్యాలను నమోదు చేసిన ఆసీస్ బ్యాటర్లు. ఇప్పుడు మరోసారి భారత్‌పై ఆ ఫీట్ సాధించారు.
  • బుమ్రా బౌలింగ్‌లో దూకుడుగా ఆడిన ఏకైక బ్యాటర్ సామ్ కాన్‌స్టాస్. 33 బంతుల్లో 34 పరుగులు చేశాడు. గతంలో అలిస్టర్ కుక్ (40 బంతుల్లో 25 పరుగులు) సాధించాడు.
  • ఇక టెస్టుల్లో దాదాపు 4,484 బంతుల తర్వాత బుమ్రా బౌలింగ్‌లో సిక్స్‌ వచ్చింది. అది కూడా కాన్‌స్టాస్‌ రెండు సిక్స్‌లు కొట్టిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. జోస్ బట్లర్ (2018) మాత్రమే ఈ ఘనత నమోదు చేశాడు.

కోహ్లీ Vs కాన్‌స్టాస్‌ - ఐసీసీ రిఫరీ యాక్షన్ తీసుకోవాలి : మాజీ క్రికెటర్లు

'గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా?- అలా అస్సలు చేయకు'- జైస్వాల్​పై రోహిత్ గరం!

Last Updated : 12 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.