Anaganaga Oka Raju Pre Wedding Video : 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో సక్సెస్ సాధించిన స్టార్ హీరో నవీన్ పొలిశెట్టి తాజాగా మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. 'అనగనగ ఒక రాజు' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాలో ఆయన కీ రోల్ ప్లే చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్‌తో ఆడియెన్స్‌లో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ప్రీ వెడ్డింగ్ వీడియో అంటూ మేకర్స్ మరో స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసి అలరించారు.
నవీన్ బర్త్‌డే సందర్భంగా వచ్చిన ఆ గ్లింప్స్ ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్టైనర్గా నెట్టింట సందడి చేస్తోంది. అందులో నవీన్ ఎప్పటిలాగే తన మార్క్ కామెడీ పంచ్‌లతో అలరించారు. ఇక నటి మీనాక్షి చౌదరి ఈ సినిమాలో నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. గ్లింప్స్‌లో కొన్ని సెకెండ్స్ పాటు ఆమె మెరిసి సందడి చేశారు.
రాజుగారి పెళ్లిలో కాజు కట్లీ కూడా బంగారం రేకుతోనే ఉండాలి అంటూ స్టార్టింగ్‌లో రిచ్‌గా చూపించారు. ఆ తర్వాత ముకేశ్ అంబానీకి ఫోన్ చేసి అనంత్ మ్యారేజ్‌కు వచ్చిన సెలబ్రిటీల గురించి ఫన్నీగా ఆరా తీస్తుంటారు నవీన్. ఆ ఈవెంట్‌కు వచ్చిన కొందరు సెలబ్రిటీలను ఇక్కడి సంగీత్ కు తీసుకురమ్మంటూ చెప్తుంటారు. ఆ తర్వాత ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్లో నవీన్, మీనాక్షి ఫొటోలు తీసుకునే విధానం కూడా ఫన్నీగా ఉంటుంది. అయితే సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను రివీల్ చేయలేదు మేకర్స్. దీంతో ఈ మూవీపై మూవీ లవర్స్‌లో మరింత ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది.
ఇక నవీన్ కెరీర్ విషయానికి వస్తే, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన ఈ స్టార్ హీరో 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' వంటి చిత్రాలతో టాలీవుడ్లో నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇటీవలె అనుష్కతో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'లో మెరిసి అభిమానులను అలరించారు. ఇందులోనూ ఆయన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు.