Rohit Sharma On Jaiswal : మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. చివరి సెషన్లో వరుస వికెట్లు పడగొట్టి టీమ్ఇండియా గేమ్‌లోకి వచ్చింది. ఈ సమయంలో ప్రత్యర్థి బ్యాటర్లకు మరో ఛాన్స్ ఇవ్వద్దొని భావించిన కెప్టెన్ రోహిత్ శర్మ కట్టుదిట్టంగా ఫీల్డింగ్ అమలు చేశాడు. నిలకడగా ఆడుతున్న లబూషేన్- స్టీవ్ స్మిత్ జోడీని విడగొట్టేందుకు సిల్లీ పాయింట్‌లో ఫీల్డర్‌ను పెట్టి స్పిన్నర్లను బరిలోకి దింపాడు.
ఈ క్రమంలో సిల్లీ పాయింట్‌లో ఉన్న జైస్వాల్‌పై రోహిత్ కాస్త కొప్పడ్డాడు. బ్యాటర్ బంతిని ఆడకముందే జైస్వాల్ పదే పదే జంప్ చేస్తున్నాడు. దీంతో సహనం కోల్పోయిన రోహిత్, జైస్వాల్‌ను మందలించాడు. 'ఓయ్ జైస్వాల్, గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? అతడు బంతి ఆడకముందే జంప్ చేస్తున్నావ్. అలా చేయకు. బంతి ఆడేవరకు అలాగే నిలబడి ఉండు' అని అన్నాడు. ఈ మాటలు అక్కడే ఉన్న స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rohit Sharma to Yashasvi Jaiswal:
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 26, 2024
" arre jassu, gully cricket khel raha hain kya tu? jab tak ball khele nai, uthne ka nai (jassu, are you playing gully cricket? don't jump until he plays the ball)". 🤣👌 pic.twitter.com/6ErdiT6bEr
మార్నస్ లబూషేన్ (72 పరుగులు, 145 బంతుల్లో)- స్మిత్ (68* పరుగులు, 111 బంతుల్లో) జోడీ మూడో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే 65.1 ఓవర్ వద్ద యంగ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. చక్కని బంతితో లబూషేన్‌ను బోల్తా కొట్టించాడు. అతడు విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కింది. టాపార్డర్ బ్యాటర్లు చెలరేగారు. టాప్ - 4 బ్యాటర్లు హాఫ్ సెంచరీలు సాధించారు. తొలి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టీవ్ స్మిత్ (68 పరుగులు), ప్యాట్ కమిన్స్ (8 పరుగులు) ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో రాణించాడు. ఆకాశ్ దీప్, సుందర్, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
కోహ్లీ Vs కాన్‌స్టాస్ - ఐసీసీ రిఫరీ యాక్షన్ తీసుకోవాలి : మాజీ క్రికెటర్లు
బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన ఆసీస్ ప్లేయర్ - డెబ్యూ మ్యాచ్‌లోనే రెండు రికార్డులు సొంతం