యుద్ధభూమి నుంచి సేఫ్గా భారత్కు.. విమానాల్లో జైహింద్ నినాదాల హోరు
Ukraine Russia News: ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ గంగ' చేపట్టింది. ఈ క్రమంలో ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకువచ్చిన భారతీయులకు కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వివిధ ప్రాంతీయ భాషల్లో విద్యార్థులకు స్వాగతం పలికారు. మంత్రులు గజేందర్ షెకావత్, వీరేంద్ర కుమార్, రాజీవ్ చంద్రశేఖర్ కూడా విద్యార్థులకు స్వాగతం పలికి వారికి ధైర్యం చెప్పారు. స్వదేశానికి తిరిగి చేరుకున్నందుకు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. జైహింద్, భారత్ మాతా కీ జై నినాదాలతో విమానాల్లో హోరెత్తించారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST