ఫోన్​ మాట్లాడుతూ నిర్లక్ష్యం.. బిడ్డతో సహా మ్యాన్​హోల్​లో పడి.. - woman along with child fell into sewer

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 15, 2021, 4:58 PM IST

హరియాణాలో నిర్లక్ష్యంతో ఓ మహిళ తన ప్రాణాలు, తన బిడ్డ ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చింది. ఫరీదాబాద్​లోని జవహర్​ కాలనీలో.. ఓ మహిళ బిడ్డను ఎత్తుకుని ఫోన్​ మాట్లాడుతూ కాలినడకన బయటకు వెళ్లింది. కొద్ది దూరం నడిచిన తర్వాత ఆమెకు ఓ స్టాండ్​ ఎదురైంది. ఫోన్​లో మాట్లాడుతుండటం వల్ల స్టాండ్​ వెనక.. తెరిచి ఉన్న మ్యాన్​హోల్​ను ఆమె గుర్తించలేదు. అలానే ముందుకు నడవడం వల్ల బిడ్డతో సహా మ్యాన్​హోల్​లో పడిపోయింది. అక్కడే ఉన్న వారు పరుగులు తీసి వారిద్దరినీ కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. గత కొంతకాలంగా.. మ్యాన్​హోల్​ మూసివేయమని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు. కానీ అధికారులు పట్టించుకోవడం లేదని వారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.