Azerbaijan Flight Crash Reason : అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలిన ఘటనలో కుట్ర కోణాలు ప్రచారంలోకి వస్తున్నాయి. బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి ప్రయాణిస్తున్న విమానం కజఖ్‌స్థాన్‌లో కూలిపోయింది. పక్షి ఢీకొనడం వల్ల పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ పేర్కొంది. ఘటనలో 38 మంది చనిపోయారని ప్రకటించింది.
డ్రోన్‌గా భావించి కూల్చివేత?
అయితే విమాన ప్రమాద దృశ్యాలను చూసిన నెటిజన్లు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడులు జరగడమే అందుకు కారణం. దానిని ఇక్రెయిన్‌కు చెందిన డ్రోన్‌గా భావించడం వల్లే రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసినట్లు నెటిజన్లు అనుమానిస్తున్నారు.
స్పందించని డిప్యూటీ ప్రధాని!
ఉక్రెయిన్ డ్రోన్ దాడులను రష్యా తిప్పికొడుతున్న సమయంలోనే పైలట్ అప్రమత్తమై ఓ కాల్ పంపించారని కొన్ని మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి. కొన్ని చిత్రాల్లో విమానం ఉపరితలంపై బుల్లెట్ ఆనవాళ్లు, రంధ్రాలు కనిపించినట్లు వెల్లడించాయి. అయితే ఈ కథనాలపై కజఖ్‌స్థాన్ డిప్యూటీ ప్రధానిని మీడియా ప్రశ్నించినా ఆయన స్పందించలేదు.
బుధవారం క్రిస్మస్ సమయంలో కూడా ఉక్రెయిన్‌పై రష్యా దాడుల ఉద్ధృతి కొనసాగింది. ఆ దేశంలోని పలు విద్యుత్తు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని 70కిపైగా క్షిపణులు, 100కుపైగా డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా ఈ వివరాలను వెల్లడించారు. రష్యా ప్రయోగించిన వాటిలో బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయని తెలిపారు. తాము 50 క్షిపణులు, పలు డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశపూర్వకంగానే క్రిస్మస్ రోజు భీకర దాడులు జరిపించారని జెలెన్‌స్కీ ఆరోపించారు.
ప్రమాదం జరిగిందిలా!
అజర్‌బైజన్‌లోని బాకు నుంచి బయల్దేరిన ప్రయాణికుల విమానం రష్యా రిపబ్లిక్ చెచెన్యా రాజధాని గ్రోజ్నీ వైపు వెళ్తుండగా బుధవారం ప్రమాదానికి గురైంది. గ్రోజ్నీలోని దట్టమైన మంచు కారణంగా దారి మళ్లించారు. ఈ క్రమంలోనే అక్టౌ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదానికి ముందు విమానం పలుమార్లు గిరగిరా తిరిగి, నేల కూలింది. దీంతో మంటలు చెలరేగాయి.
ఇళ్లను ఢీకొట్టి కూలిన విమానం- ఒక ఫ్యామిలీలోని 10మంది ప్రయాణికులు మృతి