ETV Bharat / offbeat

ఇడ్లీలో ఈ "కారం పొడి" ఉండాల్సిందే! - హోటల్​​ స్టైల్లో అద్దిరిపోతుంది - IDLI PODI RECIPE IN TELUGU

-టిఫెన్​ రుచిని పెంచే కమ్మటి కారం పొడి - ఇలా చేస్తే ఆహా అనాల్సిందే!

How to Make Idli Podi Recipe
How to Make Idli Podi Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2024, 1:36 PM IST

How to Make Idli Podi Recipe : ఎక్కువ మంది వేడివేడి ఇడ్లీలను సాంబార్​, కారం పొడితో తినడానికి ఇష్టపడతారు. ఇంట్లో ఇడ్లీలు చేసిన ప్రతిసారీ సాంబార్ చేయడం కుదరదు. అందుకే.. చాలా మంది కమ్మటి ఇడ్లీ పొడి ప్రిపేర్​ చేసుకుని నిల్వ పెట్టుకుంటారు. అయితే.. కొంతమందికి ఈ ఇడ్లీ కారంపొడి చేయడం సరిగా రాదు. దీంతో వారు మార్కెట్లో దొరికే ఇడ్లీ కారం పొడి ప్యాకెట్లు కొనుగోలు చేస్తుంటారు. అయితే.. ఈ స్టోరీలో చెప్పిన విధంగా సింపుల్​గా చేసుకుంటే ఇంట్లోనే కమ్మటి ఇడ్లీ కారం పొడి రెడీ చేసుకోవచ్చు. పైగా ఈ పొడి రెండు నెలలపాటు నిల్వ ఉంటుంది. మరి, ఇక ఆలస్యం చేయకుండా ఇడ్లీ కారం పొడి ఎలా తయారు చేయాలో ఓ లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు..

  • నువ్వుల నూనె
  • మినపప్పు- అరకప్పు
  • శనగపప్పు-కప్పు
  • ఎండుమిర్చి-8
  • బ్యాడిగి మిర్చి-8
  • పుట్నాల పప్పు-3 టేబుల్​స్పూన్లు
  • నువ్వులు-2 టేబుల్​స్పూన్లు
  • ఇంగువ-2 చిటికెళ్లు
  • వెల్లుల్లి రెబ్బలు-12
  • కరివేపాకు-2

తయారీ విధానం..

  • ముందుగా స్టవ్​పై పాన్ పెట్టి అందులో టేబుల్​స్పూన్ల​ నువ్వుల నూనె వేసి వేడి చేయండి.
  • ఆపై శనగపప్పు వేసి సన్నని మంట మీద దోరగా వేపుకోండి. శనగపప్పు దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • తర్వాత అదే పాన్​లో మినపప్పు వేసి ఎర్రగా వేపుకోండి. దోరగా వేగిన మినపప్పుని అదే ప్లేట్లోకి తీసుకోండి.
  • పప్పులను ఇలా విడివిడిగా వేపుకుంటేనే బాగా వేగుతాయి. పప్పులను సన్నని మంటమీద మాత్రమే వేపుకోవా​లని గుర్తుంచుకోండి. ఇలా వేపుకుంటేనే ఇడ్లీ పొడి ఎంతో కమ్మగా ఉంటుంది.
  • అనంతరం అదే పాన్​లో కాస్త నువ్వుల నూనె వేసి బ్యాడిగి మిర్చి, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోండి.
  • మీ దగ్గర బ్యాడిగి మిర్చి లేకపోతే కారం గల ఎండుమిర్చి 15 వేసుకోవచ్చు.
  • మిర్చీల నుంచి పొగ వస్తున్నప్పుడు నువ్వులు వేసి వేపండి. ఆ తర్వాత పుట్నాలపప్పు, కరివేపాకు వేసి కాసేపు వేపండి.
  • ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ప్లేట్లోకి తీసుకోండి.
  • పప్పులు చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి రవ్వలాగా గ్రైండ్​ చేసుకోండి.
  • అంతే ఇలా సింపుల్​గా రెడీ చేసుకుంటే.. కమ్మని ఇడ్లీ పొడి మీ ముందుంటుంది.
  • వేడివేడి ఇడ్లీలలో కాస్త నెయ్యి వేసుకుని.. ఈ ఇడ్లీ పొడితో కలిపి తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.
  • నచ్చితే మీరు కూడా ఇలా కమ్మని ఇడ్లీ పొడిని ఇంట్లో చేసుకోండి.

ఇవి కూడా చదవండి :

చలికాలం ఇడ్లీ/దోశ పిండి చక్కగా పులియాలంటే - పప్పు నానబెట్టేటప్పుడు వీటిని ఒక స్పూన్ కలిపితే చాలట!

ఎన్నిసార్లు చేసినా "ఇడ్లీలు" మెత్తగా రావట్లేదా ? - ఈ కొలతలు, టిప్స్​ పాటిస్తూ చేస్తే దూదిలాంటివి పక్కా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.