ETV Bharat / bharat

ఇప్పుడు 90స్ కాంగ్రెస్ కాదు- ఇక BJP, RSS తోక ముడవాల్సిందే: రాహుల్ - RAHUL GANDHI ON BACKWARD CLASS

దళితులు, బీసీల ప్రయోజనాలను 1990ల్లో కాంగ్రెస్ విస్మరించింది- విలువలున్న కాంగ్రెస్ మళ్లీ వచ్చేసింది- బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లు ఇక తోక ముడవాల్సిందే!

Rahul Gandhi On Backward Class
Rahul Gandhi (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2025, 8:06 PM IST

Rahul Gandhi On Backward Class : దళితులు, వెనుకబడిన వర్గాల ప్రయోజనాల పరిరక్షణ అంశాన్ని 1990వ దశకంలో కాంగ్రెస్ విస్మరించిందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. మునుపటి విలువలున్న కాంగ్రెస్ మళ్లీ వచ్చేసిందని, త్వరలో బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లు తోక ముడిచి పరార్ కావాల్సిందేనని హెచ్చరించారు. 'వంచిత్ సమాజ్ : దశ ఔర్ దిశ' పేరుతో గురువారం దిల్లీలో దళిత ఇన్‌ఫ్లూయెన్సర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

1990వ దశకంలో లోటుపాట్లు
'రాజకీయాల్లో అంతంత మాత్రంగా చోటు పొందితే దళితులు, బీసీల సమస్యలు పరిష్కారం కావు. వాళ్లు ప్రభుత్వ వ్యవస్థల్లో, సంపదలో భాగాన్ని పొందే స్థాయికి ఎదగాలి. ఇందిరాగాంధీ హయాంలో దళితులు, మైనారిటీలు, బీసీల ప్రయోజనాలను కాపాడగలమనే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండేది. 1990వ దశకం వచ్చేసరికి పార్టీలో చాలా లోటుపాట్లు జరిగాయి. ఆ విషయంలో కాంగ్రెస్ అంతగా స్పందించలేదు. మనం కేవలం రాజకీయ ప్రాతినిధ్యం గురించి మాట్లాడి సరిపెట్టకూడదు. రాజకీయప్రాతినిధ్యం కోసమే కాన్షీ రామ్ పోరాడారు. కానీ బీజేపీ వాళ్లు రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రాధాన్యం లేని అంశంగా మార్చారు. దళితులు, బీసీ వర్గం ప్రజాప్రతినిధులను మాట్లాడలేని విగ్రహాల్లా మార్చామని లోక్‌సభలో కొందరు బీజేపీ ఎంపీలు చెప్పారు. విద్యారంగం, న్యాయ రంగం, కార్పొరేట్ ప్రపంచం ఇలా ప్రతీచోటా అధికార వాటాను చేజిక్కించుకోవాలి' అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు.

ప్రాతినిధ్యానికి, అధికారంలో వాటాకు తేడా
'ప్రాతినిధ్యం వహించడానికి, అధికారంలో వాటాను పొందడానికి చాలా తేడా ఉంది. బీసీలు దేశంలో 50 శాతం మంది ఉన్నారు. అయితే అధికారంలో బీసీల వాటా 5 శాతమే. దళితులు దేశంలో 15 శాతం మంది ఉన్నారు. అధికారంలో వాళ్ల వాటా 1 శాతమే. అధికారంలో వాటా, సంపదలో వాటాలో ఎక్కడున్నాం అనేది ఆలోచించుకోవాలి. దళితులు, బీసీలు అధికారంలో వాటాను దక్కించుకునే దాకా ఆయా వర్గాల సమస్యలకు పరిష్కారాలు దొరకవు' అని రాహుల్ గాంధీ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.