పర్యటకులకు ఊపిరాగేలా చేసిన పులి - పర్యటకులకు అతిసమీపంగా వచ్చిన చిరుతపులి
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్ రణతంబోరే ప్రాంతంలోని సవాయి మాధోపుర్‌లో... ఓ పులి కలకలం సృష్టించింది. గణేష్ మార్గ్ నుంచి జోగి మహల్‌కు వెళ్తోన్న కొందరు పర్యటకులు ఓ పార్కులో ఆగిన నేపథ్యంలో వారికి ఊపిరి ఆగేలా చేసింది. అకస్మాత్తుగా గోడపైకి దూకి వారికి అతి సమీపంగా వచ్చింది. జిప్సీ వాహనంలో కూర్చున్న ఆ పర్యటకులకు హాని తలపెట్టకుండా తిరిగి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన రెండు రోజుల క్రితమే జరిగిందని పార్కు యాజమాన్యం పేర్కొంది.
Last Updated : Jan 24, 2021, 8:22 AM IST