హైకోర్టు జడ్జి ఛాంబర్లోకి భారీ పాము.. చివరకు... - ముంబయి కోర్టు
🎬 Watch Now: Feature Video
ముంబయి హైకోర్టులో ఓ భారీ పాము కలకలం సృష్టించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ఆర్ బోర్కర్ ఛాంబర్లో ఈ పాము కనిపించింది. సుమారు 7 అడుగులకుపైగా పొడవు ఉన్నట్లు తెలుస్తోంది. పాముల రెస్క్యూ బృందానికి సమాచారం అందించారు సిబ్బంది. కార్యాలయంలోకి ప్రవేశించిన పామును పట్టుకుని.. అటవీ ప్రాంతంలో వదిలేశారు. కరోనా నేపథ్యంలో వర్చువల్ విచారణలు జరుపుతోంది కోర్టు. దాంతో ఎక్కువ మంది కోర్టులో లేకపోవటం వల్ల ఎవరికీ హాని జరగలేదని అధికారులు చెప్పారు.